Allu Arjun: భారీ సెట్‌లో ‘పుష్ప2’ షూటింగ్
పుష్ఫ 2 సినిమాలోని పుష్పరాజ్, షెకావత్ సార్ మధ్య అదిరిపోయే సీన్స్ షూట్ చేస్తున్నాడట సుకుమార్.

Sukumar is shooting the intense scenes between Pushparaj and Shekawat sir in the movie Pushfa 2
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమాల్లో.. పుష్ప2 ఒకటి. పుష్ప సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ ఈసారి అస్సలు తగ్గేలేదే అంటున్నారు. ప్రస్తుతం పుష్పరాజ్, షెకావత్ సార్ మధ్య అదిరిపోయే సీన్స్ షూట్ చేస్తున్నాడట సుకుమార్.పుష్ప2 లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం.
పుష్పరాజ్ ఎర్రచందనం దుంగలను ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే పనిలో ఉంటే..షెకావత్ సార్ పుష్పరాజ్‌ని పట్టుకునే పనిలో ఉన్నాడట. విలన్లకు చుక్కలు చూపించడంతో పాటు షెకావత్ సార్‌కు చెమటలు పట్టిస్తున్నాడట పుష్పరాజ్. అడవి నుంచి తీసుకొచ్చిన ఎర్ర చందనం దుంగలను ఓ కొండలా పేర్చిన ప్రత్యేక సెట్‌లో ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. పుష్ప పార్ట్ వన్‌లో ఇంటర్వెల్ బ్యాంగ్‌లో పోలీసులకు దొరక్కుండా.. దుంగలను నదిలో పడేసి గూస్ బంప్స్ తెప్పించాడు పుష్పరాజ్.
పుష్ప ది రూల్ కోసం పుష్ప 1 కు మించి స్కెచ్చులు వేస్తున్నారట బన్నీ, సుకుమార్. పుష్పరాజ్ దెబ్బకు పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలవడం పక్కా అంటున్నారు. ఖచ్చితంగా పుష్ప2 వెయ్యి కోట్లు రాబడుతుందని లెక్కలు వేస్తున్నారు.ఇక ఇప్పటివరకూ మొత్తం 40 శాతం షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి.. వచ్చే సమ్మర్ కానుకగా ఏప్రిల్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.