Sukumar: పుష్ప 2 ఆగిపోయింది.. చిక్కుల్లో లెక్కల మాస్టార్
పుష్ప 2 మూవీ షూటింగ్ స్పీడ్ అందుకుంది. భారీ యాక్షణ్ సీన్ ని మావోయిస్టులకే అడ్డా అనుకున్న ఏరియాలో తీస్తున్నారనే టైంలో, బాంబ్ పేలింది. షూటింగ్ మొత్తం ఆగిపోయింది. బాంబంటే ఏ మావోయిస్టులో వేసిన బాంబు కాదు, ఐటీ శాఖ వేసిన బాంబుతో పుష్ప 2 ఫ్యూచరే డైలామాలో పడింది
రీసెంట్ గా మైత్రీ మూవీ మేకర్స్ తోపాటు సుకుమార్ టీం మీద కూడా ఐటీ రైడ్ జరిగింది. సర్లే ఇదెప్పటిలాంటి రైడే అనుకునేలోపు, ఈసారి 500 కోట్ల లెక్కల్లో బొక్కలున్నాయట. ఒకటి మైత్రీ మూవీమేకర్స్ టీం 200 ఎకరాలు కొనటానికి వాడిన డబ్బెక్కడిది..? అలానే పుష్ప 1 వల్ల వచ్చిన డబ్బుని సుకుమార్ తన వాటాగా తీసుకుని, ఏరూపంలోకి మార్చాడో కొన్ని క్లూస్ దొరికాయట.
మొదటి సారి జరిగిన రైడ్ లో ఏవిషయాలు బయటపడలేదని, రెండోసారి జరిగిన రైడ్ లో మాత్రం అటు మైత్రీ మూవీ మేకర్సే కాదు, సుకుమార్ ట్యాక్స్ ఎగ్గొట్టి కొన్న ప్రాపర్టీస్ తాలూకు రుజువులు దొరికాయట. ఇప్పుడా లెక్కల తాలూకు బొక్కలు పూర్చే టెన్షన్ లో ఉన్న సుకుమార్ అండ్ టీం, పుష్ప 2 షూటింగ్ ని తాత్కాలికంగా ఆపేసిందని తెలుస్తోంది. ఐటీ శాఖకు దొరికిన ఆధారాలను బట్టి చూస్తే ఈడీ కూడా రంగంలోకి దిగేలా ఉంది. పొలిటీషియన్స్ బ్లాక్ మనీ కూడా ఇక్కడ ఇన్ వాల్వ్ అవటంతో ఈడీ కూడా రంగంలోకి దిగబోతోందట. ఇది ఇలానే కొనసాగితే పుష్ప 2 షూటింగ్ మళ్లీ మొదలవ్వటం కష్టమే అంటున్నారు.