పార్ట్ 3 లేదు తొక్క లేదు.. పుష్పను లైట్ తీసుకున్న సుకుమార్

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఇండియన్ సినిమాలో ఒక సెన్సేషన్. ఈ సినిమా వసూళ్లు అలాగే సినిమా సాధించిన రికార్డులు అన్ని ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. దాదాపు 200 కోట్లకు పై సినిమా వసూళ్లు సాధించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2025 | 01:28 PMLast Updated on: Jan 31, 2025 | 1:28 PM

Sukumar Who Took Pushpa Light

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఇండియన్ సినిమాలో ఒక సెన్సేషన్. ఈ సినిమా వసూళ్లు అలాగే సినిమా సాధించిన రికార్డులు అన్ని ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. దాదాపు 200 కోట్లకు పై సినిమా వసూళ్లు సాధించింది. ఐటి అధికారులు దెబ్బకు కలెక్షన్స్ ఎంత అనేది సినిమా మేకర్స్ బయట పెట్టడం లేదు. 32 రోజులు వసూళ్లు మాత్రమే బయటపెట్టేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇక ఐటి అధికారులు ఫోకస్ పెట్టడంతో సినిమా వసూళ్ల గురించి పెద్దగా మాట్లాడటం లేదు. ఇక డిస్ట్రిబ్యూటర్, నిర్మాత నటి కుమార్ మాత్రం ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు వచ్చాయని అన్నారు.

చాలామంది సినిమా కొనడానికి ఇష్టపడలేదని తెలుగు రాష్ట్రాల్లో సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కాలేదంటూ కామెంట్ చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా నార్త్ ఇండియాలో మాత్రం భారీగా వసూళ్లు సాధించింది. దాదాపు 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ అక్కడ బాలీవుడ్ సినిమాలకు మించి సాధించడంతో నేషనల్ మీడియా ఈ సినిమాను ఓ రేంజ్ లో లేపుతోంది. ఇక జనవరి 17 నుంచి ఈ సినిమా రీలోడేడ్ వెర్షన్ రిలీజ్ చేశారు మేకర్స్. రీలోడేడ్ వెర్షన్ లో 20 నిమిషాలు కలపగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా నెట్ఫిలిక్స్ లో రిలీజ్ అవుతుంది. ఇందులో కూడా రీలోడేడ్ వెర్షన్ రిలీజ్ చేశారు. అయితే ఈ రీలోడెడ్ వర్షన్ కాన్సెప్ట్ చూసిన జనాలు ఇక ఈ సినిమా మూడో పార్ట్ లేదు అనే క్లారిటీకి వచ్చేస్తున్నారు. మూడో పార్ట్ ఉంటుందని ఇప్పటివరకు ఎదురుచూసిన ఫ్యాన్స్ ఇక మూడో పార్ట్ ఉండకపోవచ్చు అనే ఒపీనియన్ కు వచ్చేస్తున్నారు. అందుకే రీలోడ్ వర్షన్ పేరుతో ఇప్పటివరకు షూట్ చేసిన కొన్ని సీన్స్ మళ్లీ యాడ్ చేస్తున్నారని సమాచారం. సినిమాపై భారీగా హైప్ ఉండటంతో ఓటీటీ లో కూడా భారీగా వ్యూస్ వచ్చే అవకాశం ఉంది.

అందుకే జాగ్రత్త పడి రీలోడ్ వర్షన్ రిలీజ్ చేశారు. దీనితో ఈ సినిమా దాదాపు నాలుగు గంటలకు పైగానే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే థియేటర్లో మూడు గంటల 17 నిమిషాలు ఉండటం ఆ తర్వాత రీలోడ్ వర్షన్ తో మూడు గంటల 40 నిమిషాలకు చేరడంతో మొత్తం ఇంటర్వెల్ తో కలిపి సినిమా 4 గంటలు అయింది. దీనిపై ఫ్యాన్స్ కూడా కాస్త ఇబ్బంది పడ్డారు అంతసేపు కూర్చుని ఒక సినిమా చూడటం ఈ రోజుల్లో సాధ్యం కాదని సినిమా టైం తక్కువగా ఉంటే బాగుంటుందని ఒపీనియన్ వస్తోంది. ఒటీటీలో మరో 20 నిమిషాలు కలిపారు. మూడో పార్ట్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి రీలోడెడ్ వర్షన్ పేరుతో షూట్ చేసిన ప్రతి సీను రిలీజ్ చేసేస్తున్నారని స్లోగా జనాలకు అర్థం అవుతుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఓ ప్రాజెక్ట్ ఫైనల్ చేశాడు. రెండు మూడు నెలల్లో ఏ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ కనబడుతోంది.