రెబల్ స్టార్ తో సుకుమార్ ఫస్ట్ టైం… అప్పుడు మిస్ కాని ఇప్పుడు…

టాలీవుడ్ లో ఇప్పుడు ఊహకందని కొన్ని కాంబినేషన్స్ సెన్సేషన్ అయ్యేలా ఉన్నాయి. రాజమౌళితో ఎన్నడూ మహేశ్ బాబు సినిమా చేయలేదు. బన్నీకి కూడా ఛాన్స్ దొరకలేదు... అచ్చంగా అలానే సుకుమార్ తో ఎందుకనో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సెట్ కాలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 16, 2025 | 07:40 PMLast Updated on: Jan 16, 2025 | 7:40 PM

Sukumar Works With Prabhas

టాలీవుడ్ లో ఇప్పుడు ఊహకందని కొన్ని కాంబినేషన్స్ సెన్సేషన్ అయ్యేలా ఉన్నాయి. రాజమౌళితో ఎన్నడూ మహేశ్ బాబు సినిమా చేయలేదు. బన్నీకి కూడా ఛాన్స్ దొరకలేదు… అచ్చంగా అలానే సుకుమార్ తో ఎందుకనో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సెట్ కాలేదు. పాన్ ఇండియా కింగ్ తో సుకుమార్ లాంటి దర్శకుడి సినిమా పడితే, పాన్ ఇండియా కాదు, అది పాన్ వరల్డ్ మార్కెట్ లో దుమ్ముదులిపే ఛాన్స్ఉంది..అలాంటి కాంబినేషన్ తో సెన్సేషన్ ఏదో క్రియేట్ అయ్యేలా ఉందా? రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా ప్లాన్ చేశాడు. తర్వాత ఎన్టీఆర్, మహేశ్ బాబుతో పాత కాంబినేషన్ రిపీట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడని ప్రచారం కూడా జరుగుతోంది. కట్ చేస్తే లాస్ట్ మంథ్ ప్రభాస్ ని కలిసిన సుకుమార్, మళ్లీ రెబల్ స్టార్ తో ఈనెలాఖర్లో మీటింగ్ ప్లాన్ చేసుకున్నాడట. ఇది లీకవ్వగానే, రెబల్ స్టార్ తో సుకుమార్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడనే టాక్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తోంది. నిజానికి రాజమౌలి తర్వాత పాన్ ఇండియాని షేక్ చేసిన స్టార్ డైరెక్టర్ సుకుమార్. అలాంటి తను ఏకంగా రాజమౌళినే మించే రైటర్ కమ్, డైరెక్టర్ గా పుష్ప2 తో ప్రూవ్ చేసుకున్నాడు. అలాంటి తనతో రెబల్ స్టార్ సినిమా అంటే బాక్సాఫీస్ లో సినీ సునామీ రావాల్సిందే.. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు కన్ఫామ్ అవబోతోంది? ప్రాజెక్ట్ డెవలప్ మెంట్ ఎలా ఉంది?

కొన్ని కాంబినేషన్ లు సెట్ అయితే చాలు, కథెంటి? సినిమా ఎలా ఉండబోతోందని తేలకముందే, సెన్సేషనేదో క్రియేట్ అయ్యేలా ఉందని ఫిక్స్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి కాంబినేషనే సుకుమార్ డైరెక్షన్ లో ప్రభాస్ మూవీ… పాన్ ఇండియాని ఐదు హిట్లతో షేక్ చేసిన రెబల్ స్టార్ కి ఆల్రెడీ పాన్ ఇండియా కిరీటం దక్కింది. సో తను కొత్తంగా ఏం ప్రూవ్ చేసుకోవాల్సిన పనిలేదు.

కాని కొన్ని కాంబినేషన్లతో ఇంకేదో వండర్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందన్న కోణంలోనే, సుకుమార్ తోప్రభాస్ ప్రాజెక్ట్ అంటనే చెవులు నిక్కబొడుచుకుని వినాల్సి వస్తోంది. అదే జరిగేలా ఉంది.

మొన్నే పుష్ప2 తో రెండో పాన్ ఇండియా హిట్ కొట్టిన సుకుమార్, తర్వాత రామ్ చరణ్ తో మూవీ ఎనౌన్స్ చేశాడు. అది పూర్తయ్యాక ఎన్టీఆర్, మహేశ్ బాబుతో ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాడన్నారు. కాని లాస్ట్ మంథ్ ప్రభాస్ తో సుకుమార్ మీటింగ్ తర్వాత లెక్కలు మారాయి. ఈ నెల 25 న సుకుమార్ కి ప్రభాస్ అపాయింట్ మెంట్ ఇవ్వటంతో, సీక్రెట్ గా ఏదో జరుగుతోందన్న గుసగుసలు మొదలయ్యాయి

ప్రజెంట్ ప్రభాస్ కూడా ది రాజా సాబ్ ని పూర్తి చేసే పనిలో ఉణ్నాడు. ఫౌజీ కూడా జూన్ లోగా పూర్తవుతుందని తెలుస్తోంది. తర్వాత వెంటనే స్పిరిట్ మూవీ పట్టాలెక్కించేందుకు సందీప్ రెడ్డి రెడీ అయ్యాడు. ఆతర్వాత సలార్2 కూడా క్యూలో ఉంది. కల్కీ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు సమ్మర్ లో మొదలౌతాయని తెలుస్తోంది.. ఎలా చూసినా రెండు మూడేళ్ల వరకు ప్రభాస్ ఫుల్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.

కాబట్టి ఇప్పట్లో సుకుమార్ తో ప్రభాస్ మూవీ జరిగే పని కాదు. కాని 2027 లో మాత్రం జరిగే ఛాన్స్ఉంది. ఆలోగా రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా పూర్తవుతుంది కాబట్టి, అప్పుడే ప్రభాస్ కమిటైన సినిమాలు పూర్తవుతాయని తేలింది కాబట్టి, 2027 లో ఈ కాంబినేషన్ వర్కవుట్ అవ్వొచ్చు

దానికి గురించే ప్రభాస్ ని కలుస్తున్నాడట సుకుమార్. ఆర్టిఫిషీయిల్ ఇంటలీజెన్స్ వాడి, ప్రభాస్ లో భారీ ఎత్తున పాన్ వరల్డ్ మూవీఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. దానికి 90 శాతం పని ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ తోనే కాబట్టి, ఇప్పటి నుంచే ఆ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాడట సుకుమార్… సో ఇలా చరణ్ సినిమా ప్లాన్ చేస్తూనే, ప్రభాస్ ప్రాజెక్టుని కూడా పట్టాలెక్కించేందుకు గ్రౌండ వర్క్ స్టార్ట్ చేశాడు సుకుమార్.