Suma Kanakala : గుండె ముక్కలైందన్న సుమ..
సుమ కనకాల (Suma Kanakala) ..యాంకర్ (Anchor) లకి స్టార్ డంని తీసుకొచ్చి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని చెప్పవచ్చు.

Suma Kanakala Hot Commons on Rajakar movie
సుమ కనకాల (Suma Kanakala) ..యాంకర్ (Anchor) లకి స్టార్ డంని తీసుకొచ్చి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని చెప్పవచ్చు. సినిమా ఫంక్షన్స్ తో పాటు టెలివిజన్ లో ప్రసారమయ్యే ప్రోగ్రాం ల ద్వారా ఎంతో మంది అభిమానులని సంపాదించింది. పైగా తెలుగుచిత్ర పరిశ్రమతో ఆమెకి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. రెండున్నర దశాబ్దాల క్రితమే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటింది. ప్రస్తుతం స్టార్ యాంకర్ హోదాలో తన హవాని కొనసాగిస్తు ఉంది. తాజాగా ఆమె రజాకార్ (Razakar) మూవీ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.
ఇటీవలే రజాకార్ మూవీ చూసాను. అందులోని సన్నివేశాలు చూసి నా గుండె ముక్కలైంది. హైద్రాబాద్ సంస్థానం (Hyderabad Institution) యొక్క ప్రజల స్వాతంత్య్ర పోరాటాన్ని చాలా చక్కగా చూపించారు. ఇలాంటి సినిమాను తెరకెక్కించిన దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్ అంటు సుమ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపింది. అలాగే మూవీలో నటించిన అనసూయ,ప్రేమ, ఇంద్రజ, బాబీసింహా, వేదిక ఇలా ప్రతి ఒక్కరు చాలా అధ్బుతంగా నటించారని కూడా చెప్పింది. ఇప్పుడు సోషల్ మీడియాలో రజాకార్ గురించి సుమ చేసిన ట్వీట్ ని చూసిన చాలా మంది సుమ కూడా రజాకార్ లో ఒక క్యారక్టర్ చేసుంటే బాగుండేదని అంటున్నారు. ఎందుకంటే సుమ కొన్నాళ్ల క్రితం తనే టైటిల్ రోల్ లో జయమ్మ పంచాయితీ అనే మూవీలో నటించింది. అందులోని సుమ నటనకి ప్రతి ఒక్కళ్ళు ఫిదా అయ్యారు.
ఇక సుమ చేసిన ట్వీట్‌కు హీరోయిన్ వేదిక థాంక్యూ సుమ అంటు రిప్లై కూడా ఇచ్చింది. రజాకార్ సినిమా అయితే రోజురోజుకి మౌత్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. సినిమా కధాంశం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినదే అయినా కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. మరి సుమ తరహాలో ముందు ముందు ఇంకెంత మంది సినీ ప్రముఖులు రజాకార్ గురించి స్పందిస్తారో చూడాలి.