Suma Latha: గ్రాండ్‌గా సుమలత కొడుకు పెళ్లి.. చీఫ్ గెస్ట్‌గా రజినీకాంత్..
సీనియర్ హీరోయిన్, లోక్‌సభ ఎంపీ సుమలత కొడుకు అభిషేక్ అంబరీష్ పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిద్దప్ప కూతురు అవివాతో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యాడు అభిషేక్ అంబరీష్. మోడల్ అయిన అవివాను నాలుగేళ్ల క్రితం ఓ ఫంక్షన్‌లో కలిశాడు అభిషేక్.

Suma Latha Son Marriage
కొద్దిరోజులకే వీళ్ల ఫ్రెండ్‌షిప్ లవ్‌గా మారింది. వీళ్లిద్దరి ప్రేమను రెండు కుటుంబాల్లో పెద్దలు ఓకే చేయడంతో ఈ లవ్ బర్డ్స్ పెళ్లి పీఠలేక్కారు. బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా అభిషేక్-అవివాల పెళ్లి జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు సూపర్‌స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో వివాహ వేడుకకు హాజరయ్యారు. రేపు మాండ్యలో జరగబోయే రిసెప్షన్‌కు కూడా ఇంతే గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు. 15 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అభిషేక్ రిసెప్షన్‌కు కుటుంబ సభ్యులు, మిత్రులతో పాటు అభిమానులు కార్యకర్తలు భారీగా హాజరుకానున్నారు.