Sundaram Master: జస్ట్ పాస్ మార్కులతో గట్టెక్కిన రెండు కొత్త సినిమాలు
ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాలదే హవా. రెండు చిన్న సినిమాలు, ఒక డబ్బింగ్ సినిమా ప్రేక్షకులు ముందుకొచ్చాయి. వైవా హర్ష, అభినవ్ గోమటం కమెడియన్స్ నుంచి హీరోలుగా ప్రమోషన్ పొంది చేసిన సినిమాలు సక్సెస్ అయ్యాయా..?
Sundaram Master: వైవా హర్ష హీరోగా ఫస్ట్ టైం చేసిన ప్రయోగం సుందరం మాస్టార్. ఆల్రెడీ ఓ గిరిజన ప్రాంతంలో ఇంగ్లీష్ ఇరగదీసే జనం ఉంటారు. వాళ్లకి టీచర్‌గా వెళ్లిన మాస్టార్‌కే సీన్ రివర్స్ అవుతుంది. ఇక ఆ ప్రాంతంలో విలువైన ఒక విషయం కోసం రంగంలో దిగిన సుందరం మాస్టార్‌కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే కోణంలో వచ్చిన కథ సుందరం మాస్టార్.
KALKI 2898 AD: శివరాత్రికి కల్కి అవతారం.. మతిపోవాల్సిందే..
ఈ సినిమాకి జస్ట్ పాస్ మార్కులే పడుతున్నాయి. కాస్త నవ్విస్తే చాలు.. కాసులే అనే భ్రమలో సినిమాలు తీసే బ్యాచ్‌కి, కంటెంట్‌లో నవ్వించే కమిట్మెంట్ ఉండకపోతే, సీన్ రివర్సే అనే కంప్లైట్స్ పెరిగాయి. ఓవరాల్‌గా కథ, కథనం, మ్యూజిక్, డైలాగ్స్, పెర్ఫామెన్స్, మేకింగ్ అన్నీంట్లో పర్లేదనే మాటే వినిపిస్తోంది. ఇలా సుందరం మాస్టర్‌కి థియేటర్స్‌లో ఎగ్జామ్ జరిగితే పాస్ మార్కులే పడ్డాయి. ఇక.. మలయాళంలో ఆహా, ఓహో అనేంతగా ఫోకస్ అయిన భ్రమయుగానికి తెలుగులో వెలుగు కష్టమనే కామెంట్సే వస్తున్నాయి. కొత్తగా అనిపించే కథ, కథనం, మూడే పాత్రలు మమ్ముటి మతిపోగొట్టే పెర్ఫామెన్స్ అన్నీ అదుర్స్. కాని, ఓటీటీలో ఓపిగ్గా చూడాల్సిన సినిమాని, థియేటర్స్‌లో టిక్కెట్ కొని చూసే ఓపిక ఉంటుందా..?
తెలుగు జనాల టేస్ట్‌కి ఇది సెట్ అవుతుందా.. అనేలానే స్లోగా సాగే ప్రయోగంగా ఫోకస్ అవుతోంది. కేవలం ఒక్క డైలాగ్.. మస్త్ షేడ్స్ ఉన్నాయ్‌రా అనే మాటతో, పాపులరైన స్టార్ అభినవ్ గోమటం.. ఇప్పుడు తనకి కలిసొచ్చిన డైలాగ్‌నే సినిమాగా మార్చి ప్రయోగం చేశాడు. టైటిల్‌లో ఉన్న షేడ్స్ కథలో, కథనంలో, మేకింగ్‌లో, పెర్ఫామెన్స్‌లో మిస్ అయ్యాయి. మస్త్ షాక్స్ ఉన్నాయి సినిమాలో అన్న కామెంటే పెరిగిపోతోంది.