Sundaram Master Review: హర్ష మెప్పించాడా.. సుందరం మాస్టర్ రివ్యూ..
స్టోరీ విషయానికి వస్తే.. సుందరం.. గవర్నమెంట్ స్కూల్‌లో సోషల్ టీచర్‌గా వర్క్ చేస్తుంటాడు. ఎవరు ఎక్కువ కట్నం ఇస్తే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. ఆ ఏరియా ఎంఎల్ఏ సుందరంతో ఇంగ్లీష్ టీచర్ గా ఒక అడవిలో ఉండే మనుషుల దగ్గరకి వెళ్లి అక్కడ ఉన్న ఒక రహస్యాన్ని కనుక్కోవాలని అంటాడు.

Sundaram Master Review: షార్ట్స్ ఫిలిమ్స్‌లో కామెడీని పండించే స్థాయి నుంచి సినిమాల్లో కామెడీని పండించే స్థాయికి ఎదిగిన నటుడు హర్ష చెముడు అలియాస్ వైవా హర్ష. లేటెస్ట్‌గా సుందరం మాస్టర్
సినిమాతో సోలో హీరోగా వచ్చాడు. మరి మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీ విషయానికి వస్తే.. సుందరం.. గవర్నమెంట్ స్కూల్‌లో సోషల్ టీచర్‌గా వర్క్ చేస్తుంటాడు. ఎవరు ఎక్కువ కట్నం ఇస్తే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు.
REVANTH POWERFUL : ఇక రేవంత్ మార్క్ పాలిటిక్స్.. వైఎస్ లాగా మారిపోతారా ?
ఆ ఏరియా ఎంఎల్ఏ సుందరంతో ఇంగ్లీష్ టీచర్ గా ఒక అడవిలో ఉండే మనుషుల దగ్గరకి వెళ్లి అక్కడ ఉన్న ఒక రహస్యాన్ని కనుక్కోవాలని అంటాడు. అలా చేసి పెడితే డిఈఓ ని చేస్తా అంటాడు. కట్నం ఎక్కువ వస్తుందనే ఆశతో సుందరం అడవికి వెళ్తాడు. ఇక ఆ అడవిలో ఉన్న వాళ్ళకి ఇండియాకి స్వాతంత్రం వచ్చిందన్న విషయం కూడా తెలియదు. కానీ ఆ అడవి మనుషులే సుందరానికి ఇంగ్లీష్ నేర్పుతారు. వాళ్ళకి ఇంగ్లీష్ ఎలా వచ్చింది. ఈ క్రమంలో హర్ష అడవిలో ఉన్న రహస్యాన్ని ఎలా కనుక్కున్నాడు అసలు ఎంఎల్ఏ హర్షని మాత్రమే అక్కడికి ఎందుకు పంపించాడు..? ఇంతకీ అడవిలో ఉన్న రహస్యం ఏంటి..? హర్ష డిఈఓ కోరిక నెరవేరిందా అనేదే ఈ చిత్ర కథ.
పర్పామెన్స్ విషయానికి వస్తే.. హర్ష వైవా సుందరం మాస్టర్ క్యారక్టర్‌లో బాగానే చేసాడు. కానీ తన క్యారక్టర్‌కి సరైన విధి విధానం లేకపోవడంతో తేలిపోయాడు. దివ్యశ్రీపాద.. అడవి పిల్ల క్యారక్టర్‌లో సరిగ్గా సరిపోయింది. కానీ తను పెద్దగా నటించడానికి ఏమి లేదు. మిగతా క్యారక్టర్‌ల విషయానికి వస్తే నటన పరంగా పెద్దగా చెప్పుకోవలసిన అవసరం లేదు. హర్షకి సహాయపడే కుర్రోడు మాత్రం బాగా చేసాడు. ఎంఎల్ఏ క్యారక్టర్‌లో హర్ష వర్ధన్ బాగున్నాడు. ఒక కొత్త హర్షవర్ధన్‌ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
టెక్నికల్ విషయాలు.. ఇక దర్శకుడు విషయానికి వస్తే తన ఊహలో పుట్టిన కథని పూర్తి స్క్రిప్ట్‌గా మలుచుకోవడంలో చాలా సక్సెస్ ఫుల్‌గా ఫెయిల్ అయ్యాడు. ఇక అంతకు మించి చెప్పుకోవడానికి మెరుపులు ఏమి లేవు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నాసిరకంగా ఉన్నాయి. కెమెరా, సంగీతం వీటి గురించి కూడా చెప్పుకోవడానికి ఏమి లేదు. కొన్ని డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉంటాయి. అడవి అందాలను చక్కగా చూపించాడు. సినిమాటోగ్రాఫర్ ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు. ఫైనల్‌గా సుందరం మాస్టర్ మూవీ సినిమాకి తక్కువ.. షార్ట్ ఫిలింకి ఎక్కువ అన్న ఫీలింగ్ కలుగుతుంది.