Gadar-2: రికార్డులు బ్రేక్ చేస్తున్న గదర్-2
పఠాన్ రికార్డును గదర్2 బ్రేక్ చేస్తుందా? అత్యధిక వసూళ్లు సాధించి హిందీ సినిమా రికార్డ్ పఠాన్ పేరు మీద వుంది. దీన్ని అధిగమించాలంటే.. గదర్ ఇంకో 150 కోట్లు కలెక్ట్ చేయాలి. ఇది సాధ్యమేనా? హ్యావ్ ఎలుక్?

Sunny Deol, Ameesha Patel starrer Gadar 2 rains collections
వరుస ఫ్లాపుల్లో వుంటూ.. కనీసం 100 కోట్లు కలెక్ట్ చేయలేకపోయినా.. బాద్షా బాక్సాఫీస్ వద్ద దాడి చేస్తే ఎలా వుంటుందో పఠాన్ చూపించింది. పఠాన్ వచ్చేవరకు ఈ రికార్డ్ బాహుబలి2 హిందీ వెర్షన్ పేరు మీదే వుంది. 511 కోట్లు కలెక్ట్ చేయగా.. 524 కోట్లతో పఠాన్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. హిందీ వెర్షన్ రికార్డ్ బ్రేక్ చేయాలంటే.. గదర్2 మూడు సినిమాల రికార్డులను దాటాలి. 524 కోట్ల నెట్‌తో పఠాన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా 511 కోట్లతో బాహుబలి2 సెంకడ్ ప్లేస్‌లో వుంది. 435కోట్ల నెట్‌తో కెజిఎఫ్2 మూడో ప్లేస్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం గదర్ 375 కోట్లతో నాలుగో స్థానంలో వుంది. కెజిఎఫ్2 రికార్డ్‌ను బ్రేక్ చేయడం గదర్2కు పెద్ద కష్టమేమీ కాదు. ఇంకో ఐదారు రోజుల్లో ఓవర్ టేక్ చేస్తుంది. బాహుబలి2 రికార్డ్‌ను దాటేస్తే.. పఠాన్‌ను దాటేయడం ఈజీనే. అయితే.. గదర్2 బాహుబలి2 దాకా వెళ్తుందా? లేదా అంటే.. ఈ వీకెండ్ నాటికి తెలిసిపోతుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద గదర్2 ఊపు చూస్తుంటే.. ఏదైనా జరగొచ్చనిపిస్తోంది.