Sunny Leone : కానిస్టేబుల్ ఎగ్జాక్‌కు అప్లై చేసిన సన్నీ లియోన్
సన్నీ లియోని (Sunny Leone).. ఈ పేరు తెలియని యంగస్టర్స్ నాకు తెలిసినంతవరకూ దాదాపు ఉండరు. పోర్నస్టార్ నుంచి బాలీవుడ్ (Bollywood) యాక్టర్ మారిన ఈ బ్యూటీ పోలీస్ కావాలనుకుంటోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం దరఖాస్తు కూడా చేసుకుంది. ప్రభుత్వం నుంచి ఆమెకు హాల్‌టిక్, అడ్మిట్‌కార్డ్ కూడా వచ్చింది. సన్నీ ఏంటి పోలీస్ ఏంటి అసలు ఈ గోల ఏంటి అనుకుంటున్నారా.
సన్నీ లియోని (Sunny Leone).. ఈ పేరు తెలియని యంగస్టర్స్ నాకు తెలిసినంతవరకూ దాదాపు ఉండరు. పోర్నస్టార్ నుంచి బాలీవుడ్ (Bollywood) యాక్టర్ మారిన ఈ బ్యూటీ పోలీస్ కావాలనుకుంటోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం దరఖాస్తు కూడా చేసుకుంది. ప్రభుత్వం నుంచి ఆమెకు హాల్‌టిక్, అడ్మిట్‌కార్డ్ కూడా వచ్చింది. సన్నీ ఏంటి పోలీస్ ఏంటి అసలు ఈ గోల ఏంటి అనుకుంటున్నారా. బీ టౌన్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సన్నీలియోని డిటెయిల్స్‌తో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న కానిస్టేబుల్ ఎగ్జామ్ హాల్ టికెట్ ఈ టాపిక్‌కు కారణమైంది. యూపీ ప్రభుత్వం పోలీస్ రెక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన హాల్‌టికెట్స్ రీసెంట్‌గానే విడుదలయ్యాయి. ఆ హాల్‌టికెట్స్‌లో ఒకటి సన్నీ పేరుతో వెలుగులోకి వచ్చింది. ఈ హాల్‌టికెట్ ప్రకారం.. తిర్వా జిల్లా కనౌజ్ లోని శ్రీమతి సోనే శ్రీ స్మారక బాలిక మహావిద్యాలంలో సన్నీ ఎగ్జామ్ రాయాలి. మరి సన్నీ ఎగ్జామ్ రాసిందా అంటే.. రాయలేదు.
ఇది ఎవరో ఆకతాయి చేసిన పని. సన్నీ ఫొటోతో హాల్‌టికెట్ రావడంతో పోలీసులు ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేశారు. ముంబైకి చెందని ఓ వ్యక్తి యూపీ ఫోన్ నెంబర్‌తో ఈ పని చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో యూపీ పోలీస్ రెక్రూట్‌మెంట్‌బోర్డ్ ( Police Recruitment) మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో కర్నాటకలో ఓసారి ఇలాగే జరిగింది. కర్నాటక ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఓ నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్‌తో ఓ మహిళ వివరాలకు బదులు సన్నీ లియోనీ వివరాలు వచ్చాయి. ఈ విషయం అప్పట్లో పెద్ద దుమారాన్ని లేపింది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. అప్లై చేసిన సమయంలో ఫాం తాను నింపకుండా తన స్నేహితుడితో నింపించింది ఆ మహిళ.
ఈ కారణంగానే వివరాలు సరిగ్గాలే తప్పులు జరిగినట్టు అప్పుడు అధికారులు గుర్తించారు. ఇప్పుడు కూడా దాదాపు అలాంటి మిస్టేకే.. అదే సన్నీ లియోని పేరుతో జరిగింది. ఈ పని చేసినవాళ్లను నెటిజన్లు సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. సన్నీ పేరుతో జాబ్ అప్లై చేస్తే నీకేం సంబరం దొరికిందిరా సైకో అంటూ తిట్టిపోస్తున్నారు. ఇది ఫేక్ కాబట్టి సరిపోయింది కానీ.. నిజంగానే సన్నీ లియోని పోలీస్ ఐతే ఎంతమంది కావాలని అరెస్ట్ అయ్యేవాళ్లో.