Sunny Leone: ప్రేమించిన వాడే మోసం చేశాడు.. సన్నీ లైఫ్‌లో ఇంత బాధ ఉందా..?
ఆమె ప్రస్తుతం తన భర్త డేనియల్ వెబర్, పిల్లలతో హ్యాపీగా ఉంది. ఐతే డానియల్ కంటే ముందు.. సన్నీలియోన్ ఓ వ్యక్తిని ప్రేమించింది. అతని వల్ల లైఫ్‌లో మరచిపోలేని బాధని అనుభవించినట్లు సన్నీ లియోన్ ఎమోషనల్ అయింది.

Sunny Leone: పెద్దగా పరిచయం అవసరం లేని పేరు.. సన్నీ లియోన్. మొదట అశ్లీల చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన సన్నీ.. ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంది. తక్కువ సమయంలోనే క్రేజీ నటిగా మారింది. తెలుగులో కూడా సన్నీ కొన్ని చిత్రాల్లో నటించింది. ఆమె ప్రస్తుతం తన భర్త డేనియల్ వెబర్, పిల్లలతో హ్యాపీగా ఉంది. ఐతే డానియల్ కంటే ముందు.. సన్నీలియోన్ ఓ వ్యక్తిని ప్రేమించింది.
Raghu Rama Krishna Raju: టీడీపీకి తలనొప్పిగా మారిన రఘురామ.. టిక్కెట్ ఇస్తారా.. లేదా..?
అతని వల్ల లైఫ్‌లో మరచిపోలేని బాధని అనుభవించినట్లు సన్నీ లియోన్ ఎమోషనల్ అయింది. అతనితో సన్నీకి ఎంగేజ్ మెంట్ కూడా అయింది. ఆ తర్వాత అతడి ప్రవర్తనలో మార్పు వచ్చిందట. మరో రెండు నెలల్లో పెళ్లి ఉండగా.. అతను పూర్తిగా మారిపోయాడని.. దీంతో ఒకరోజు విసుగొచ్చి.. నిజాయితీగా ప్రేమిస్తున్నావా లేదా అని అడిగేశానని.. చెప్పుకొచ్చింది సన్నీ. దీంతో అతను ఓపెన్ అయి.. ఎలాంటి ప్రేమ లేదని చెప్పేశాడట. దీంతో తన హార్ట్ బ్రేక్ అయిందని సన్నీ కన్నీళ్లు పెట్టుకుంది. అతని వల్ల చాలారోజులు మానసికంగా కుంగిపోయినట్లు.. చెప్పుకొచ్చింది. ఐతే దేవుడు తన కోసం మరో అద్భుతం చేశాడని.. డేనియల్ వెబర్‌ని తన జీవితంలోకి పంపాడని.. డేనియల్ నన్ను ప్రేమించడమే కాదు.. తన కష్టాల్లోనూ తోడున్నాడని.. సన్నీ ఎమోషనల్ అయింది.
అమ్మ నాన్న చనిపోయినప్పుడు.. తనకు తోడుగా ఉంది డేనియల్ మాత్రమేనని ప్రశంసలు కురిపించింది. ఇక ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న సన్నీలియోన్.. సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. 2011లో డేనియల్ వెబర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరు 2017లో నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది సరోగసి ద్వారా ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చారు.