సూపర్ కంటెంట్ హిట్ కామన్… డ్రై కంటెంట్ లో పోటుగాడెవరు..?
కత్తిలాంటి కథ... ఖతర్నాక్ క్యారెక్టరైజేషన్. కదిలిస్తూనే కవ్వించే పాటలు.. వీటన్నీంటికి సరిగ్గా హ్యాండిల్ చేసే విజినరి అయిన దర్శకుడు... డబ్బులు నీల్లలా ఖర్చు పెట్టే నిర్మాత.. ఇవన్నీ ఉంటే ఆ సినిమా పాన్ ఇండియా లెవల్లో దుమ్ముదులపటం కామన్.. కాని ఇవేవి లేకపోతే పంచ్ పడటం కూడా కామనే..
కత్తిలాంటి కథ… ఖతర్నాక్ క్యారెక్టరైజేషన్. కదిలిస్తూనే కవ్వించే పాటలు.. వీటన్నీంటికి సరిగ్గా హ్యాండిల్ చేసే విజినరి అయిన దర్శకుడు… డబ్బులు నీల్లలా ఖర్చు పెట్టే నిర్మాత.. ఇవన్నీ ఉంటే ఆ సినిమా పాన్ ఇండియా లెవల్లో దుమ్ముదులపటం కామన్.. కాని ఇవేవి లేకపోతే పంచ్ పడటం కూడా కామనే.. అలాంటి వరస్ట్ సిచ్చువేషన్ లోనే వరల్డ్ వైడ్ గా రికార్డులు ఎన్టీఆర్ సొంతమయ్యాయి. హిట్ కంటెంట్ తో హిట్ మెట్టు ఎవరైనా ఎక్కుతారు.. కాని ఏటికి ఎదురీదడం మాత్రం పాన్ ఇండియా లెవల్లో ఇద్దరే ఇద్దరు హీరోలు చేశారు. అది రీసెంట్ గా అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కాస్త ముందుగా అయితే రెబల్ స్టార్ ప్రభాస్.. ఇంతకి రికార్డులతో పాన్ ఇండియా కింగ్స్అని పించుకున్న వీళ్ళు ఎందుకు ఎదురీదాల్సి వచ్చింది?
బాహుబలి హిట్ అయ్యందంటే కారణం ఉంది. త్రిబుల్ ఆర్ కి కంటెంట్ తోపాటు మేకింగ్, మల్టీస్టారర్ ప్యాడింగ్ అన్నీ కలిసొచ్చాయి కాబట్టి హిట్టైంది. ఇక కల్కీకి గ్రాఫిక్స్ తోపాటు డివోషనల్ యాంగిల్, ఇలా పాన్ ఇండియా హిట్ మూవీలన్నీంటికి ఏదో ఒక ప్లస్ ఉంది
కంటేంట్ కూడా సాలిడ్ కథతో లింకైంది..
ఇలాంటి కథల్నే ఓవర్ లోడెట్ కంటెంట్స్ అంటారు.. ఇవి హిట్ అవటం పెద్ద విషయం కాదు.. కాని శంకరాభరణం లాంటి మూవీలు హిట్ అయితే అది అసలు హిట్ అంటే.. ఎందుకంటే ఇవి చాలా డ్రై కంటెంట్స్ అంటారు. బోర్ కొట్టించే ఛాన్స్ లేదంటే కళా ఖండాలుగా మిగిలిపోవటం తప్ప కమర్శియల్ గా హిట్ అయ్యే అవకాశాలు తక్కువుంటాయి
అలాంటివి హిట్ అయ్యాయంటే, అవి వంద కమర్శియల్ హిట్ మూవీలకు సమానమంటారు.. సడన్ గా ఈ డిస్కర్షన్ రావటానికి రీజన్ దేవర మీద పెరిగిన సానుబూతి… నిజం చెప్పాలంటే శంకరాభరణం, దేవరకి అస్సలు పోలిక లేదు. అది కళాత్మకమైంది. ఇది పక్కా మాస్ మతిపోగొట్టే ఫార్ములా మూవీ.
కాని కామన్ పాయింట్ ఏంటంటే, శంకరా భరణం చాలా డ్రై మూవీ… దేవర లోకూడా అబ్బ అనిపించే కమర్శియల్ పాయింట్స్ తక్కువ.. కేవలం ఎన్టీఆర్ ఎంట్రీ సీన్, ఫైట్ సీన్ వదిలేస్తే సినిమా అంతా హీరో పెర్ఫామెన్స్ మీదే దూసుకెళ్లింది. ఏమాత్రం కథలో కాస్త మ్యాజిక్ యాడ్ అయినా ఈ సినిమా 2 వేల కోట్ల వసూళ్ల రికార్డు క్రియేట్ చేసేది
అదే మిస్ అవటానికి కారణం దర్శకుని డ్రై విజన్… ఎన్టీఆర్ రెండు పాత్రలు వేసి, పాత్రలో పాతుకుపోయే సరికి దేవర 510 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది. అలా కాకుండా ఇదే కథ మరోకరితో తీస్తే అసలికే ఎసరయ్యేదనే కామెంట్స్ ఉన్నాయి. నిజమే ఎన్టీఆర్ కాబట్టి తనని నమ్మిన దర్శకుడితో తానెంటో ప్రూవ్ చేసుకో గలిగాడు. టీం బరువంతా తాను మోసాడు.. ఇలాంటి హీరోని సరిగ్గా వాడుకుంటే, బాక్సాఫీస్ తో పాత్రతో ఆడకుంటాడు…
కాబట్టే, పాన్ ఇండియా హిట్లతో హీరో వల్లే ఆడిన మూవీలే ఆ స్టార్ స్టామినా ని రిఫ్లెక్ట్ చేస్తాయంటారు. అలా చూస్తే ప్రభాస్ ని మించేలా రిస్క్ లు చేశాడు ఎన్టీఆర్. ఇప్పటికీ రిస్క్ చేస్తూనే ఉన్నాడు.