Super Star: చిరంజీవి, పవన్ కోసం ప్రేమతో మహేశ్ బాబు..
మెగాస్టార్ చిరంజీవి మీద మహేశ్ కి ప్రత్యేకమైన అభిమానం. చిరు కూడా మహేష్ హిట్ మూవీలను ఇమిటేట్ చేస్తూ మెచ్చుకోవటం, ఆడియో ఫంక్షన్లో సూపర్ స్టార్ సినిమాలను ప్రమోట్ చేయటం లాంటివి చేశాడు. ఇక పవన్, మహేశ్ బాబు మధ్య కూడా ఫ్రెండ్లీ రిలేషన్ షిప్ ఉంది. జల్సా కోసం మహేశ్ వాయిస్ ఓవర్ కూడాచెప్పాడు.

mega with superstar
ఇవన్నీ మెగా బ్రదర్స్ తో మహేశ్ కి ఉన్న హెల్తీ రిలేషన్ ని ఎలివేట్ చేస్తాయి. అయితే ఇప్పుడు మహేశ్ నిజంగానే చిరు, పవన్ కోసం ఓ త్యాగం చేయటం ఇండస్ట్రీ లో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే త్రివిక్రమ్ మేకింగ్ లో మహేశ్ చేస్తున్న అమరావతికి అటు ఇటు మూవీని వాయిదా వేసుకున్నాడట
చిరు, తమన్నా తో కలిసి చేస్తున్ భోళా శంకర్ ఆగస్ట్ 11 న రావటానికి ఓరకంగా మహేశే కారణమట. సాయితేజ్ తో పవన్ కలిసి చేస్తున్న వినోదియం సీతం జులై 28 కి రావటానికి కూడా సూపర్ స్టారే కారణమంటున్నారు. త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా షూటింగ్ అనుకున్న టైంకే అయ్యేలా ఉన్నా, పోస్ట్ ప్రొడక్షన్ లేటయ్యేలా ఉందట. అందుకే ఆగస్ట్ 11 నుంచి దసరాకు షిఫ్ట్ అవ్వాలని మహేశ్ టీం నిర్ణయం తీసుకుందట. అంటే కరెక్ట్ గా ట్రై చేస్తే ఆగస్ట్ 11 లో గా మహేశ్ మూవీ రావొచ్చు కాని, దసరానే సెంటిమెంట్ గా చూస్ చేసుకున్న మహేశ్, ఇలా చిరు, పవన్ సినిమాలకు సైడ్ ఇచ్చాడని, ఈ మొత్తం వ్యవహారం వెనక త్రివిక్రమ్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. మహేశ్ కి ఉన్న మెగా అభిమానాన్ని బేస్ చేసుకుని త్రివిక్రమే మహేశ్ ఇలా నిర్ణయం తీసుకునేలా చేశాడని ఇండస్ట్రీలో చర్చ పెరిగింది.