ఏకంగా సూపర్ స్టార్ నే భయపెడుతున్న దేవర.?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి రాజమౌళి శాపాన్ని ఫేస్ చేసే సీన్ లేదన్నారు. చరణ్ లానే ఎన్టీఆర్ కి కూడా త్రిబుల్ ఆర్ తర్వాత ప్లాప్ పడి తీరాల్సిందే అన్నారు. కాని ఏమైంది..? రాజమౌళి శాపాన్ని జయించిన మొదటి హీరోగానే కాదు, మొదటి పాన్ ఇండియా స్టార్ గా కూడా హిస్టరీ క్రియేట్ చేశాడు
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి రాజమౌళి శాపాన్ని ఫేస్ చేసే సీన్ లేదన్నారు. చరణ్ లానే ఎన్టీఆర్ కి కూడా త్రిబుల్ ఆర్ తర్వాత ప్లాప్ పడి తీరాల్సిందే అన్నారు. కాని ఏమైంది..? రాజమౌళి శాపాన్ని జయించిన మొదటి హీరోగానే కాదు, మొదటి పాన్ ఇండియా స్టార్ గా కూడా హిస్టరీ క్రియేట్ చేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఆ ఎఫెక్టే సూపర్ స్టార్ రజినీకాంత్ కి తగిలిందా? దేవర దూకుడుతో కోలీవుడ్ సూపర్ స్టార్ లో కంగారు పెరిగిందా? ఇవి డౌట్లు కాదు, తమిళ తంబీల సినిమాల రిలీజ్ డేట్ ని డౌట్లో పడేస్తున్న అంశాలు.. నిజంగానే రజినికాంత్ ఒకటి కాదు రెండు కాదు కనీసం పది అడుగులు వెనక్కి వేయాల్సి వస్తోంది. అంతా దేవర మహిమే… ప్రభాస్ రాకముందు వరకు ఆసియాలోనే అధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ అనిపించుకున్న రజినీకాంత్ నే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భయపెడుతున్నాడా? దేవర వల్లే అది సాధ్యమైందా?
సూపర్ స్టార్ రజినీకాంత్ అంటేనే ఒకప్పుడు ఇండియాలోనే కాదు, ఆసియాలోనే జాకీచాన్ లాంటి స్టార్ ని మించేలా 150 కోట్ల పైనే రెమ్యునరేషన్ తీసుకునే స్టార్. ప్రభాస్ 300 కోట్లు తీసుకుంటూ, ఆరికార్డుని బ్రేక్ చేశాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ కి 160 కోట్ల రెమ్యునరేషన్ అందుకుని సూపర్ స్టార్ ని మించిపోతున్నాడు
ఇదంతా బానే ఉంది కాని,తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నే మ్యాన్ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భయపెట్టడం షాకింగ్ గా ఉంది. ఇదేదో గాలి వార్త కాదు, రూమర్ అంతకన్నా కాదు… ఇదే నిజానికి చాలా దగ్గర ఉన్న విషయం అంటున్నారు.
ఎందుకంటే దసరా స్పెషల్ గా రావాల్సిన సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ వెట్టయాన్ అంటే వేటగాడు, వాయిదా పడుతోందట. దసరాకు ఇంకా వారానికి కాస్త అటు ఇటుగానే టైం ఉంది. ఇంతవరకు తెలుగు ప్రమోషన్ కాదు కద, సరిగ్గా తమిళ ప్రమోషన్ కూడా లేదు.
కారణం ఒకటే దేవర సునామీ… తమిళ్ లో దేవర జోరు తెలుగు, హిందీ వర్షన్స్ స్థాయిలో లేకపోవచ్చు. కాని తెలుగు, హిందీ రెండూ కూడా చాలా పెద్ద మార్కెట్లు… ఇక్కడ దేవర గ్రౌండ్ లో రీసౌండ్ చేస్తుంటే, మరో మూవీకి వసూల్ల వరద కష్టం
అందుకే రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్, సూపర్ సీనియర్ కూడా తన కొత్త మూవి వెట్టయాన్ ని వెనక్కి తీసుకెళుతున్నాడు. దసరా నుంచి దీపావళికి వెట్టయాన్ వాయిదా పడేలా ఉందట. ఆల్ మోస్ట్ అది కన్పామ్ అనేతెలుస్తోంది
దేవర సునామీ ఈరేంజ్ లోఉన్నప్పుడు పోటీ కంటే, ఈ సినిమా జోరు తగ్గాక సీన్ లకొస్తే, వసూళ్ల వరద, ఓపెనింగ్స్ బాగుండే ఛాన్స్ఉంది. అందుకే పెద్ద హీరో, యంగ్ హీరో లాంటి లెక్కలు వేసుకోకుండా, రజినీకాంత్ వాయిదా తీర్మాణానికే మొగ్గుచూపాడట. అంటే దేవర దెబ్బకి సూపర్ స్టార్ మూవీ వెట్టయాన్ కూడా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.
అసలు దేవర ఆడటం కష్టం, ఫ్లాప్ మూవీ అన్న వాళ్లందరికీ ఇలాంటి సంఘటనలు కళ్లు తెరిపించేలా ఉన్నాయి. నిజంగా ఇది ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించే న్యూసే… తమిళ జనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, దేవర దరువుకి, పెద్ద హీరోల సినిమాలు వెనకడుగు వేయక తప్పట్లేదు..