సూపర్ స్టార్… ఐకాన్ స్టార్ కి.. అసలైన ఫ్రీడమ్ 2027లోనే..
సూపర్ స్టార్ మహేశ్ బాబు మరో రెండేళ్ల వరకు సినీ జనాలకు, తన అభిమానులకు కనిపించే ఛాన్స్ లేదు. పూర్తిగా రాజమౌళి తీసే సినిమాకు, ఆ మూవీ సెట్ కే పరిమితం కాబోతున్నాడు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు మరో రెండేళ్ల వరకు సినీ జనాలకు, తన అభిమానులకు కనిపించే ఛాన్స్ లేదు. పూర్తిగా రాజమౌళి తీసే సినిమాకు, ఆ మూవీ సెట్ కే పరిమితం కాబోతున్నాడు. ఓరకంగా హౌజ్ అరెస్ట్ లాంటి, సెట్ అరెస్ట్ గా దీన్ని మనం భావించొచ్చు.. గుంటూరు కారం మూవీ విడుదలయ్యే ఏడాది అవుతోంది… ఐనా ఇంకా రాజమౌళి సినిమా మొదలు కాలేదు. డిసెంబర్ ఎండింగ్ కి సర్ ప్రైజ్ అన్నారు. తర్వాత కాదు, జనవరి 2 కి ఇంకేదో గుడ్ న్యూస్ అన్నారు. కట్ చేస్తే అసలు ఆట డిలే అవుతూనే ఉంది. 2027 కంటే ముందు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ విడుదల మాత్రం సాధ్యం కాదని తేలింది. పుష్ప2 హిట్టైనా కాని, వివాదం వల్ల సైలెంట్ అయిన బన్నీ, మరో రెండేళ్లు సైలెంట్ గానే ఉండాల్సి వచ్చేలా ఉంది. 2027 లోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఫ్రీడమ్ దక్కేలా ఉంది…
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా లాంచ్ ఆగస్ట్ 9కి ఉండొచ్చన్నారు. మహేశ్ బాబు బర్త్ డేకి సర్ ప్రైజ్ ఉంటుందనుకున్నారు. తర్వాత దసరాకే లాంచ్ అన్న మాటలు వినిపించాయి. కట్ చేస్తే డిసెంబర్ లో భారీ ఎనౌన్స్ మెంట్ అన్నారు. ఏది జరగలేదు. సంక్రాంతికంటే ముందు రాజమౌళి టీం మహేశ్ బాబు సినిమా తాలూకు ఎనౌన్స్ మెంట్ ఇస్తుందన్నారు
కట్ చేస్తే అసలు సినిమా లాంచ్ ఇప్పట్లో అవుతుందా అన్నడౌట్లొచ్చాయి. ఏప్రిల్ నుంచే అసలైన షూటింగ్ కాబట్టి, ఈలోపు మహేశ్ బాబు జెర్మనీలో వర్క్ షాప్స్ తో బిజీ అవుతాడనే ప్రచారాలే పెరిగాయి. ఇలా గాసిప్స్ తప్ప ఎలాంటి అఫీషియల్ అప్ డేట్స్ లేవు. విచిత్రం గా న్యూఇయర్ మరుసటి రోజు భారీ సర్ ప్రైజ్ అంటూ బయటికి లీకులు, లేదంటే ఫీలర్లు తప్ప ఆ విషయంలో కూడా ఎలాంటి అప్ డేట్ లేదు..
కాని ఒకటి మాత్రం నిజమని తేలింది. మార్చ్ లేదంటే ఏప్రిల్ ఎప్పుడు మహేశ్ బాబుతో రాజమౌైళి పాన్ వరల్డ్ మూవీ పట్టాలెక్కినా రిలీజ్ మాత్రం 2027 కంటే ముందు ఛాన్సేలేదని తెలుస్తోంది. షూటింగ్ కే ఏడాది, పోస్ట్ ప్రొడక్షన్ కనీసం 6 నుంచి 8 నెలలు టైం తీసుకునే అవకాశం ఉంది. ఎలాచూసినా ఏడాదిన్నర పూర్తిగా షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కే టైం పడుతుంది. ప్రమోషన్ కి మరో 3 నెలలేసుకున్నా 2027 లో తప్ప మహేశ్ బాబు సినిమా, అంతకు ముందు వచ్చేఛాన్స్ లేదు
ఆల్రెడీ గుంటూరు కారం తర్వాత ఏడాదిగా రాజమౌలి మూవీ కోసమే తన లుక్ మారుస్తు వెళ్లాడు మహేశ్. ఇప్పుడు మరో రెండేళ్లు ఇలానే సమర్పించుకోవాల్సి వచ్చేలా ఉంది. 2027లోనే రాజమౌలి తో తను చేయబోతున్న మూవీ రిలీజ్ అయ్యేలా ఉంది. ఇక అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ కూడా ఆల్ మోస్ట్ అప్పేడే రిలీజ్ అవ్వొచ్చని తెలుస్తోంది
పుష్ప2 హిట్ తర్వాత 6 నెలలు రిలాక్స్ అయ్యి, ఆతర్వాత సినిమా చేస్తానంటున్నాడు బన్నీ. ఇంతలో పుష్ప3 మీద కూడా ప్రచారం జరిగింది. కాని త్రివిక్రమ్ సినిమానే భారీ ఎత్తున ప్లాన్ చేయటంతో, కథ సిద్దమవ్వటానికే 8 నెలల టైం పట్టేలా ఉందట. అది కూడా మైథాలజీ జోనర్ లోనే తెరకెక్కే మూవీ అనగనే గ్రాఫిక్స్ వర్క్ బానే ఉంటుందనటంతో, రెండేళ్లు పూర్తిగా మేకింగ్ కే టైం పడుతుందట. అలా చూసినా మహేశ్ బాబు, అల్లు అర్జున్ ఈ ఇద్దరి సినిమాలను 2027 కంటే ముందు థియేటర్స్ లో సందడి చేయటం ఆల్ మోస్ట్ ఇంపాజిబుల్ అని తేలింది.