Mahesh babu : ఇక మూడు సంవత్సరాలు కుదరదు..
సూపర్ స్టార్ (Superstar) మహేష్ బాబు (Mahesh Babu) ని ఫ్యాన్స్ ఎంతగా అభిమానిస్తారో ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. సినిమా రిలీజ్ అయినప్పుడు, మహేష్ బర్త్ డే (Mahesh Birthday) రోజున థియేటర్స్ దగ్గర హంగామా చెయ్యడమే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తారు. అలాగే మహేష్ కూడా తన ఫ్యాన్స్ ని ఎంతగానో అభిమానిస్తాడు.

Superstar Mahesh Babu can't wait three more years
సూపర్ స్టార్ (Superstar) మహేష్ బాబు (Mahesh Babu) ని ఫ్యాన్స్ ఎంతగా అభిమానిస్తారో ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. సినిమా రిలీజ్ అయినప్పుడు, మహేష్ బర్త్ డే (Mahesh Birthday) రోజున థియేటర్స్ దగ్గర హంగామా చెయ్యడమే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తారు. అలాగే మహేష్ కూడా తన ఫ్యాన్స్ ని ఎంతగానో అభిమానిస్తాడు. ఈ విషయం ఎన్నోసార్లు రుజవయ్యింది. తాజాగా తన ఫ్యాన్స్ కోసం మహేష్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతుంది.
దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) తో మహేష్ తన నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్న ఆ మూవీ కోసం మహేష్ అన్నివిధాలా సన్నద్ధమవుతున్నాడు. అంతకంటే ముందు మహేష్ తన అభిమానులతో ప్రత్యేకంగా కలవనున్నాడు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కృష్ణ, మహేష్ అభిమాన సంఘాలకి పిలుపు కూడా వెళ్ళింది. ఇక తన ఫ్యాన్స్ తో హడావిడిగా సమావేశం ఏర్పాటు చెయ్యడానికి గల కారణం తెలిస్తే మహేష్ ని అభినందించకుండా ఉండలేం.
జక్కన్న (Jakkanna) తో సినిమా అంటే ఎంతలేదన్నా రెండున్నర సంవత్సరాల దాకా టైం పడుతుంది. తన సినిమాలో ఒక హీరో చేస్తున్నంత సేపు ఆ హీరో అభిమానులు ఎవరు కూడా హీరోని కలవకూడదు. అలా కలిస్తే సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు గెటప్ లు కూడా బయటకి రివీల్ అవుతాయని జక్కన్న కలవనియ్యడు. సో మహేష్ రాజమౌళి షూటింగ్ లో పాల్గొనడం స్టార్ట్ చేస్తే చాలా రోజుల పాటు కలవలేడు. అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ ని మీట్ అవ్వబోతున్నాడు.ప్రెజంట్ ఎక్కడైతే మహేష్ యాడ్ షూట్స్ చేస్తున్నాడో అక్కడికి దగ్గరలో అభిమానులను కలవనున్నాడు. మాములుగా తన ప్రతి సినిమా రిలీజప్పుడు ఫ్యాన్స్ ని కలవడం మహేష్ కి అలవాటు. కానీ గుంటూరు కారం టైంలో మాత్రం కలవలేకపోయాడు. జక్కన్న సినిమా కోసం మహేష్ తన గెటప్ మీద ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నాడు.