Mahesh Babu: రాజమౌళి, మహేశ్ మూవీ లాంచ్.. హనుమంతుడిగా సూపర్ స్టార్..
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీసే సినిమా ఆగస్ట్ 9న మొదలు కాబోతోందట. మహేశ్ బాబు బర్త్ డే రోజే సినిమా ను లాంచ్ చేసేందుకు రంగం సిద్దమైంది. దసరాకు లాంచ్ చేయాలనుకున్న జక్కన్న మొత్తానికి మహేశ్ బర్త్ డేకే లాంచింగ్ కి రెడీ అయ్యాడు.. అదేరోజు ప్రెస్ మీట్ లో మొత్తం సినిమా తాలూకు డిటేల్స్ ఇవ్వబోతున్నాడట.

Mahesh Babu and Rajamouli Combo Movie
ఆఫ్రికా అడవులు, అద్భుతాల వేట నిజమే అయినా ఈ మూవీలో మహేశ్ ఇండియానా జోన్స్ లో హీరోలా ప్రొఫేసర్ కాదని తెలుస్తోంది. ఇక బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఇందులో విలన్ అన్న రూమర్స్ కూడా అబద్దం అని తెలుస్తోంది. దీపికా పదుకొనే హీరోయిన్ అన్న మాట కూడా అబద్దమేనట.
హాలీవుడ్ హీరోయిన్ జెన్నిఫర్ లారెన్స్ ఆల్ మోస్ట్ ఓకే అయ్యేలా ఉందనే గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇక జక్కన్న సినిమా ప్లాన్ చేస్తే ఏ మ్యాటర్ లీక్ కాదు. కాని ఇందులో హీరో పాత్ర హనుమంతుడిని ప్రేరణగా తీసుకుని తెరకెక్కిస్తారని, హనుమంతుడు తన శక్తి తాను తెలుసుకునే సీన్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ప్లాన్ చేశారట. ఇది ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న గుసగుసలు. సో ఆగస్ట్ 9న ఇంకా ఇలాంటి అంశాలు, మరిన్న డిటేల్స్ ని జక్కన్న స్వయంగా ఎనౌన్స్ చేయబోతున్నాడు.