Mahesh Babu : మహేష్ ఆ జుట్టు ఏంట్రా
సూపర్ స్టార్ (Superstar) మహేష్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) సినిమా కోసం రెడీ అవుతున్నాడు. బాడీ బిల్డింగ్‌తో పాటు హెయిర్ కూడా పెంచుతున్నాడు.

Superstar Mahesh Babu is getting ready for Rajamouli's film. Along with body building he is also growing hair.
సూపర్ స్టార్ (Superstar) మహేష్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) సినిమా కోసం రెడీ అవుతున్నాడు. బాడీ బిల్డింగ్‌తో పాటు హెయిర్ కూడా పెంచుతున్నాడు. ఇప్పటికే మహేష్ లాంగ్ హెయిర్ లుక్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇక ఇప్పుడు మరో సూపర్ వీడియో తెగ వైరల్ అవుతోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే.. తన ఫ్యామిలీతో ఎక్కువగా సమయాన్ని గడుపుతుంటాడు మహేష్.
తాజాగా మహేష్ తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్‌లో ఓ పెళ్ళికి హాజరయ్యాడు. ఈ పెళ్ళికి మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని కూడా వచ్చింది. ఇక మంజుల, మహేష్ బాబుని చూడగానే.. ఆ జుట్టు ఏంటి ఇంత పెంచేసావు అన్నట్టు.. జుట్టు పట్టుకొని మరీ అడిగింది. దీంతో.. వీళ్లిద్దరి మధ్య కాసేపు సరదా సంభాషణ జరిగింది.
మంజుల, మహేష్ నవ్వుతూ మాట్లాడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కా తమ్ముళ్లను ఇలా చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. అక్కా తమ్ముళ్లు ఇద్దరు కూడా రాజమౌళి సినిమా గురించే చర్చించుకున్నారని అంటున్నారు. మరోవైపు ఇదే పెళ్లికి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కూడా వచ్చింది. మహేశ్ బాబుని పలకరించిన వీడియో కూడా సోషల్ మీడియాలో అభిమానులకు తెగ నచ్చేస్తుంది. ఇకపోతే.. మహేష్ ఇంతలా జుట్టు పెంచుతున్నాడు కాబట్టి.. ఖచ్చితంగా రాజమౌళి సినిమాలో ఊహించని లుక్‌లో కనిపించనున్నాడనే చెప్పాలి. కానీ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు.