Mahesh Babu: జిమ్ లో కసరత్తులు చేస్తున్న మహేష్.. రాజమౌళి మూవీ కోసమేనా!
బాహుబలి సమయంలో ప్రభాస్, ట్రిపుల్ ఆర్ టైంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ను తనకు కావాల్సిన అవుట్ పుట్ వచ్చే వరకు వదల్లేదు జక్కన్న. అలాంటిది మహేష్ బాబును వదులుతాడా.. ఛాన్సే లేదు.

Superstar Mahesh Babu is working out in the gym for Rajamouli's action movie
రాజమౌళితో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఏండ్లకేండ్ల సమయాన్ని కేటాయించడమే కాదు.. ఎంతో హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. బాహుబలి సమయంలో ప్రభాస్, ట్రిపుల్ ఆర్ టైంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ను తనకు కావాల్సిన అవుట్ పుట్ వచ్చే వరకు వదల్లేదు జక్కన్న. అలాంటిది మహేష్ బాబును వదులుతాడా.. ఛాన్సే లేదు. అందుకే.. మహేష్ ముందు జాగ్రత్తగా కఠోర ట్రైనింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రజెంట్ మహేష్ త్రివిక్రమ్ తో కలిసి గుంటూరు కారం చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. గత కొన్ని నెలలుగా షూటింగ్ కు దూరంగా ఉన్న మహేష్ త్వరలో సెట్ లోకి అడుగుపెట్టనున్నాడు. రీసెంట్ గా వెకేషన్ ను కంప్లీట్ కావడంతో త్రివిక్రమ్ సెట్ లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త షెడ్యూల్ లో సినిమాకే హైలెట్ గా నిలిచే సీన్లను గురూజీ తెరకెక్కిస్తున్నాడట. అయితే రేపో మాపో సెట్ లోకి మహేష్ వస్తున్న టైంలో బయటకు వచ్చిన ఫోటో వైరల్ గా మారింది. జిమ్ లో మహేష్ తెగ కష్టపడుతున్నాడు. అయితే బయటకు వచ్చిన ఈ ఫోటో ఫ్యాన్స్ ను తెగ కన్ప్యూజ్ చేస్తోంది.
మహేష్ జిమ్ ఫోటో ను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. కొందరేమో.. గుంటూరు కారంలో యాక్షన్ ఎపిసోడ్ కోసం రెడీ అయ్యాడని కామెంట్స్ చేస్తుంటే.. కాదు కాదు జక్కన్న చెక్కనున్న అద్భుత చిత్రం కోసం రాసుకొస్తున్నారు. రాజమౌళి మహేష్ ప్రాజెక్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు వరల్డ్ వైడ్ మూవీ లవర్స్. విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నట్లు గత కొన్ని రోజులు వార్తలు వినిపిస్తున్నాయి. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు జక్కన్న. హాలీవుడ్ రేంజ్‌లో వెయ్యి కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఇండియానా జోన్స్ తరహాలో ఫ్రాంచైజీలను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సాహసవీరుడిగా కనిపించనున్నాడు. దాంతో భారీ యాక్షన్స్ సీక్వెన్స్‌లు ఉండనున్నాయి. అలా చేయాలంటే.. మహేష్ బాబు మరింత ఫిట్‌గా మారాల్సి ఉంది. అందుకే తన పాత్రకు తగట్లు మహేష్‌ని మలిచేందుకు రెడీ అవుతున్నాడట రాజమౌళి.