Maheshbabu- Rajamouli : SSMB 29 మే 31న మొదలు
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రాజెక్ట్ గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. త్వరలోనే గ్రాండ్‌గా ఈ ప్రాజెక్ట్ లాంచింగ్‌కు రెడీ అవుతున్నాడు జక్కన్న.

Superstar Mahesh Babu Rajamouli SSMB 29 movie update from May 31
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రాజెక్ట్ గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. త్వరలోనే గ్రాండ్‌గా ఈ ప్రాజెక్ట్ లాంచింగ్‌కు రెడీ అవుతున్నాడు జక్కన్న. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి రాజమౌలి చెప్పింది చాలా తక్కువ. నెక్స్ట్ మహేష్ బాబుతో చేస్తున్నాను, గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ, ఇండియానా జోన్స్ రేంజ్ సినిమా, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ సినిమా స్టార్ క్యాస్టింగ్ గురించి గానీ, ఇంకా మిగతా విషయాల గురించి మాత్రం చెప్పలేదు.
కానీ ఎస్ఎస్ఎంబీ 29 ఎన్నో పుకార్లు పుడుతునే ఉన్నాయి. లేటెస్ట్‌గా.. ఈ సినిమాకు వీరేన్ స్వామి క్యాస్టింగ్ డైరెక్టర్ అని.. జాతీయ ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం ప్రచురించింది. అతను విక్రమ్ ‘అపరిచితుడు’ సహా మహేష్ ‘వన్ నేనొక్కడినే’ సినిమాకూ పని చేశారని ఆర్టికల్ రాసుకొచ్చింది. దీంతో.. ప్రొడక్షన్ హౌస్ శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత, చిత్ర నిర్మాత కెఎల్ నారాయణ వివరణ ఇచ్చారు. వీరేన్ స్వామితో తమకు గానీ తమ సినిమాకు గానీ సంబంధం లేదని తెలిపారు.
సినిమాకు సంబందించిన సమాచారం ఏదైనా ఉంటే మేమే చెబుతామని పేర్కొన్నారు. కాబట్టి.. ఈ ప్రాజెక్ట్ విషయంలో వచ్చిన వార్తలలో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. కానీ ఈ సినిమా ఎప్పుడు మొదలు పెడతారా? అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా.. ఈ సినిమా అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి జక్కన్న ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.