Mahesh Babu: కన్నుకొట్టే దొంగ.. సూపర్ స్టార్ మహేశ్ బాబు..
సూపర్ స్టార్ మహేశ్ బాబు కన్నుకొట్టి దొంగతనాలు చేస్తే ఎలా ఉంటుంది.. ఫ్యాన్స్ షాక్ అవ్వాల్సిందే.. అలాంటి సీనే ఇప్పుడు సినిమాలో కనిపించబోతోంది. త్రివిక్రమ్ మేకింగ్ లో మహేశ్ బాబు చేస్తున్న సినిమాలో ఈ హీరో రెండు పాత్రలు వేయబోతున్నాడు. అందులో ఒక పాత్రకు విచిత్రమై జబ్బు ఉంటుందట.

Maheshbabu and Trivikram Combination
అమ్మాయి కనిపిస్తే కన్నుకొట్టాలి.. మెడలో నెక్లెస్ కొట్టేయాలి.. ఈరెండు జబ్బులు ఉన్న పాత్రలో మహేశ్ కనిపించబోతున్నాడట. నిజానికి హీరోకి ఏదైనా జబ్బో లోపమో ఉంటే ఆ సినిమా హిట్ అవటమే కాదు, కామెడీ పంచ్ లు బాగా పేలుతాయి. రంగస్థలంలో చరణ్ కి చెవుడు, పుష్పలో బన్నీకి భుజం సమస్య, గజినీలో సూర్యకి మతిమరుపు..
ఇలాంటి జబ్బు హీరోలతో బాక్సాఫీస్ లో ఎన్నో సార్లు వసూల్ల వరదొచ్చింది. మహేశ్ కూడా నిజానికి భ్రమకి మధ్య బతికే పాత్రని వన్ నేనొక్కిడినేలో వేశాడు. అది సగమే వర్కవుట్ అయ్యింది. కాబట్టి త్రివిక్రమ్ మూవీలో మహేశ్ కన్నుకొట్టే దొంగబుద్ది కలిసొస్తుందా అంటే, కామెడీ దాడి చేయటం మాత్రం పక్కాఅనే ప్రచారమే జరుగుతోంది. ఇప్పడీ న్యూస్ నెట్ లో వైరలయ్యేలా ఉంది.