Mahesh Babu : మహేష్ జర్మనీ… జక్కన్న కోసమేనా
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29) గురించి ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. రీసెంట్‌గా విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని చెప్పడం.. మహేష్ బాబు (Mahesh Babu) జర్మనీ (Germany) కి వెళ్లడంతో రోజుకో న్యూస్ హల్చల్ చేస్తోంది.

Superstar Mahesh Babu went to Germany for Rajamouli's Pan World movie
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29) గురించి ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. రీసెంట్‌గా విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని చెప్పడం.. మహేష్ బాబు (Mahesh Babu) జర్మనీ (Germany) కి వెళ్లడంతో రోజుకో న్యూస్ హల్చల్ చేస్తోంది. తాజాగా మహేష్ బాబు ఈ సినిమా కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే రాజమౌళి తన సినిమాలకు రెమ్యూనరేషన్‌కు బదులుగా లాభాల్లో వాట తీసుకుంటూ ఉంటాడు. మహేష్ బాబు కూడా కొన్ని సినిమాలకు అలాగే చేశాడు. కానీ లాభాల్లో వాటా అందుకునే ముందు హీరోకి కొంతైనా రెమ్యూనరేషన్ ఉంటుంది.
కానీ రాజమౌళి (SS Rajamouli) సినిమాకు మాత్రం మహేష్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. పారితోషికం కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల ఇన్‌సైడ్ టాక్. మహేష్, రాజమౌళి ఇద్దరు కూడా లాభాల్లో వాటా తీసుకునేలానే సినిమాకు రెడీ అవుతున్నారట. ఇక ఈ సినిమా కోసం మహేష్ రెండేళ్ల సమయాన్ని కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఫిజికల్‌గా వర్క్ స్టార్ట్ చేసేశాడు మహేష్. వచ్చే ఉగాదికి ఈ ప్రాజెక్ట్ లాంచనంగా ప్రారంభం కానుందని అంటున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ లేదు కానీ, సమ్మర్‌లో ఎస్ఎస్ఎంబీ 29 రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయడం పక్కా అంటున్నారు. అన్నట్టు.. ఈ ప్రాజెక్ట్‌ని వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్టు టాక్ ఉంది.
ఒంటరిగా జెర్మనీకి వెళ్లిన మహేష్ గత పదిరోజుల నుంచి అక్కడే ఉంటున్నారు. అక్కడ ఒక డాక్టర్‌ని కలుసుకోవడం కోసం మహేష్ బాబు వెళ్లారు. ఆ డాక్టర్ బాడీ ఫిట్‌నెస్ పై సూచనలు ఇస్తూ ఉంటారని.. ఆయన ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటే అర్ధమవుతుంది. గత రెండేళ్లుగా మహేష్ ఆయన దగ్గర ట్రైన్ అవుతూ వస్తున్నారు. రాజమౌళి సినిమా కోసం ఫిట్ నెస్ తో పాటు…తనను తాను మార్చుకోవడం కోసం అంటున్నారు. పాన్ వరల్డ్ (Pan World) సినిమాను ప్లాన్ చేశాడు రాజమౌళి. మహేష్ ను సూపర్ స్టార్ నుంచి సూపర్ హీరోగా మార్చబోతున్నాట. దాంతో దానికి తగ్గట్టు తనను తాను మార్చుకోవడం కోసం..బాడీ ఫిట్ నెస్.. ఫిజికల్, మెంటల్ స్ట్రెంత్ కోసం మహేష్ గట్టిగా కష్టపడుతున్నాట.