Mahesh Babu: గుంటూరు కారం అప్‌డేట్ లీక్ చేసిన హీరోయిన్
మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా గుంటూరు కారం తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలిజీ అయిన వీడియోలు, పోస్టర్లు సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌లో పెంచేశాయి.

Superstar Mahesh Babu's director Trivikram's movie Guntur Karam is said to be starring Meenakshi Chaudhary along with Srileela
ఐతే హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను లీక్ చేసింది. ఈ సినిమాలో మొదట పూజా హెగ్డే, శ్రీలీలను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డే బయటకు వెళ్లింది. దీంతో శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయింది. రెండో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా హత్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న మీనాక్షి చౌదరి తాను గుంటూరు కారంలో నటిస్తున్నట్లు లీక్ చేసింది. అంతే కాదు ఆ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను కూడా చెప్పేసింది. దీంతో మహేశ్ అభిమానులు సంబరపడుతున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనిపై మీనాక్షి మాట్లాడుతూ.. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయిందని చెప్పింది. మహేశ్ అంటే తనకెంతో ఇష్టమని, ఆయనకు తాను అభిమానినని చెప్పింది. తనతో నటిస్తోన్న అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది. షూటింగ్‌కు వెళ్లిన మొదటి రోజు, మొదటి సన్నివేశమే మహేశ్‌తో ఉందని.. ఆ రోజును ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని మీనాక్షి చౌదరి చెప్పింది. త్రివిక్రమ్, మహేశ్ బాబుల హిట్ కాంబోలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీతో తెలుగు తెరకు పరిచయమై, తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకుంది మీనాక్షి చౌదరి. ఆ తర్వాత హిట్ 2, ఖిలాడి చిత్రాల్లో సందడి చేసింది.