Rajinikanth: కాపీ కథతో.. రజినీకాంత్
జైలర్ పాటలు పేలలేదు. ఏదో ఇన్ స్టా రీల్లకు పనికొచ్చాయంతే. రజినీ డైలాగ్ పేలలేదు.. ఏదో సూపర్ స్టార్ మూవీ వస్తోందనే హంగామా అన్నారంతే.. కట్ చేస్తే జైలర్ ట్రైలర్ తో బాషా బ్యాక్ అంటున్నారు.. దానర్ధం ఏంటి? చూసేయండి.

Superstar Rajinikanth's latest movie Jailer is expected to be similar to the story of the movie Basha
బాషా ఒక్క సారి చెబితే..రెండో సారి చెప్పినట్టే.. ఎందుకంటే వందసార్లు చెప్పే రోజులు పోయాయి. కారణం బాషా ఇప్పుడు రెండో సారి మనల్ని పలకరించబోతున్నాడు. ఈనెల 10న వరల్డ్ వైడ్ గా జైలర్ గా వస్తున్నాడు.
నిజానికి జైలర్ పాటలు సోసోగా ఉండటంతో, సినిమా మీద హైప్ రాలేదు. కాని ట్రైలర్ దుమ్ముదులిపింది. దీంతో అంచనాలు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. అంతవరకు ఓకే కాని, ఇది మాడ్రన్ బాషా అంటున్నారు. బాషా సినిమా కథనే నెల్సన్ ఇలా మార్చి కొత్తగా తీశాడంటున్నారు.
బాషాలో రజినీ కాంత్ ఆటో డ్రైవర్ గా సింపుల్ గా బ్రతుకుతాడు. కాని ముంబైలో డాన్ గా తనకో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అలానే జైలర్ లో ఓ పోలిస్ కి తండ్రిగా సింపుల్ గా ఉండే రజినీకి, నార్త్ ని గడగడలాడించిన పోలీస్ హిస్టరీ ఉంది. బాషాలో తమ్ముడు పోలీస్, జైలర్ లో కొడుకు పోలీస్.. అక్కడ ఫ్లాష్ బ్యాక్ లో రజినీ డాన్, జైలర్ లో పోలీస్ .. ఇలా అంతా సేమ్ టూ సేమ్ ఒక్కటే ఛేంజ్. అందుకే బాషా రీమేక్ లాంటి జైలర్ తో ఈసారి రజినీకి సక్సెస్ మినిమమ్ గ్యారెంట్ అనాల్సి వస్తోంది.