Superstar Rajinikanth: సూపర్ స్టార్ మాస్ అవతార్.. కూలీగా రజినీ

రజనీ 171వ సినిమా రానున్న ఈ చిత్రానికి కూలీ అనే టైటిల్ ఖరారు చేశారు. కూలీ టైటిల్ రివీల్ చేస్తూ ఓ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టైటిల్ టీజర్‌లో రజినీ మాస్ అవతార్‌లో కనిపించారు. చాలా కాలం తర్వాత సూపర్ స్టార్.. ఫ్యాన్స్ కోరుకునే మాస్ లుక్కులో కనిపించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 22, 2024 | 08:50 PMLast Updated on: Apr 22, 2024 | 9:01 PM

Superstar Rajinikanths New Movie With Lokesh Kanagaraj Title Is Coolie

Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజినీ కాంత్, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో రాబోతున్న సినిమాకు టైటిల్ ఫిక్సైంది. రజనీ 171వ సినిమా రానున్న ఈ చిత్రానికి కూలీ అనే టైటిల్ ఖరారు చేశారు. కూలీ టైటిల్ రివీల్ చేస్తూ ఓ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టైటిల్ టీజర్‌లో రజినీ మాస్ అవతార్‌లో కనిపించారు. చాలా కాలం తర్వాత సూపర్ స్టార్.. ఫ్యాన్స్ కోరుకునే మాస్ లుక్కులో కనిపించారు.

RAM CHARAN: రామ్ చరణ్ సినిమాను శంకర్ రిస్కులో పెట్టాడా..?

ఆయన స్టైల్ డైలాగ్ డెలివరీ మరో అట్రాక్షన్. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇక టైటిల్ టీజర్‌లో గోల్డ్ స్మగ్లింగ్ చేసే ముఠా ఉండే డెన్‌కు వెళ్లిన రజినీ.. అక్కడి వాళ్లను చితక్కొడుతాడు. చివర్లో ముగించేద్దాం అంటూ ఆయన చెప్పిన డైలాగ్ రజినీ స్టైల్‌లో ఉంది. మొత్తంగా టైటిల్ గ్లింప్స్ అదిరిపోయేలా ఉంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే సినిమా కచ్చితంగా మరో లెవల్‌లో ఉండేలా కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత రజినీ తనదైన మాస్ అవతార్‌లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. లోకేశ్ స్టైల్ డార్క్ విజువల్స్, రజినీ యాక్టింగ్, అనిరుధ్ రవిచంద్రన్ బీజీఎం.. అన్నీ కలిసి ఆడియెన్స్‌కు ట్రీట్ ఖాయం అనిపిస్తోంది. అయితే, ఈ చిత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.

ప్రస్తుతం రజీని మరో చిత్రం చేస్తున్నారు. అది పూర్తయ్యాక రజినీ చిత్రం సెట్స్‌పైకెళ్తుంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని టీజర్‌లో హింట్ ఇచ్చారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే, ఇది లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం కాదన్నది చిత్ర వర్గాల మాట. లోకేశ్ గత చిత్రాలతో ఈ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు. కొత్త కాన్సెప్ట్‌తో సినిమా తెరపైకెళ్లనుంది. నటీనటుల వివరాలు త్వరలోనే వెళ్లడికానున్నాయి.