రణవీర్ అల్హాబాదియా ఫ్యూచర్ ఏంటిప్పుడు.. మనోడి పని అయిపోయినట్టేనా..!
మనిషి శరీరంలో మోస్ట్ డేంజరస్ పార్ట్ ఏదో తెలుసా..? మన నాలుక.. అందుకే పెద్దలు కూడా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు.

మనిషి శరీరంలో మోస్ట్ డేంజరస్ పార్ట్ ఏదో తెలుసా..? మన నాలుక.. అందుకే పెద్దలు కూడా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. అలాంటి నోటి నుంచి ఒక మాట వచ్చే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించాలి. ఒక్కసారి నోరు జారిన తర్వాత బతుకు కూడా దిగజారుతుంది. తాజాగా యూ ట్యూబర్ రణబీర్ అల్హబాదియాను చూస్తే ఇదే అనిపిస్తుంది. నాకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉంది.. మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు.. సాక్షాత్తు ప్రధానమంత్రి పిలిచి అవార్డు ఇచ్చాడు.. అని నోటికి ఏది వస్తే అది మాట్లాడితే చూస్తూ ఎవరు కూర్చోరు. రీసెంట్ గా ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో రణవీర్ చేసిన కామెంట్స్ ఎంత దుమారం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కొన్ని రోజుల కింద జరిగిన షోలో వచ్చిన ఒక కంటెస్టెంట్ ను.. మీ అమ్మానాన్నలు శృంగారం చేసుకుంటుంటే రోజు చూడడం నీకు ఇష్టమా లేదంటే ఆ శృంగారంలో ఒకసారి నువ్వు పాల్గొని జీవితంలో మళ్ళీ వాళ్ళ ప్రైవేట్ టైం చూడడం ఆపేస్తావా అంటూ ఒక దిక్కుమాలిన ప్రశ్న అడిగాడు రణవీర్. లక్షల కొద్ది ఫాలోవర్స్.. కోట్ల కొద్ది వ్యూస్ వస్తున్న ఒక రియాలిటీ షోలో ఇలాంటి ఒక ఉన్న హేయమైన ప్రశ్న అడగడంతో పార్లమెంటులో కూడా దీని గురించి చర్చ జరిగింది. కేవలం ఈ ఒక్క ప్రశ్న వల్ల సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడమే కాకుండా.. ఇకపై A రిలేటెడ్ కంటెంట్ ఏది ఉన్నా కూడా ఓటిపి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ రూల్స్ కూడా మార్చింది ధర్మాసనం.
ఇక రణ్‌వీర్ అల్లాబాడియాకు కూడా బాగానే అక్షతలు వేసింది సుప్రీమ్ కోర్ట్. ఇంత చెత్త ప్రశ్న నువ్వు ఎలా అడిగావు.. నువ్వు చేసిన ఈ పనికిమాలిన పనికి మేము నిన్ను ఎందుకు రక్షించాలో ఒక కారణం చెప్పు అంటూ ఫైర్ అయింది. తన పాస్‌పోర్టును మహారాష్ట్రలోని థానే పోలీస్ స్టేషస్‌లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అంతేకాదు కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లకూడదని.. రణ్‌వీర్ తో పాటు అతడి స్నేహితులు సైతం తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఎలాంటి షోలో పాల్గొనకూడదంటూ తీర్పు ఇచ్చింది. ఎంత ఎగిరిపడినా ఒక్క మాటతో రణవీర్ జీవితం తనకిందులు అయింది. ఇప్పుడు మనోడి ఫ్యూచర్ సందిగ్ధంలో పడిపోయింది.