Supreme Hero: ఎన్టీఆర్‌ నాకు సొంత అన్నతో సమానం

జూనియర్‌ ఎన్టీఆర్‌తో తనుకున్న అనుబంధం గురించి ఇంట్రస్టింగ్‌ విషయాలు చెప్పాడు సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2023 | 01:45 PMLast Updated on: Apr 15, 2023 | 1:45 PM

Supreme Hero Comments On Jr Ntr

తన ఫ్యామిలీ మెంబర్స్‌తరువాత మళ్లీ ఆ స్థాయిలో తనకు సపోర్ట్‌ ఇచ్చే వ్యక్తి కేవలం ఎన్టీఆర్‌ మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు. తాను ఇండస్ట్రీకి రాకముందు నుంచే ఎన్టీఆర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పాడు. ఈ విషయం చాలాసార్లు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పినా.. తారక్‌తో ఉన్న అనుబంధం గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసని చెప్పాడు తేజ్‌.

తాను సినిమాలు సెలెక్ట్‌ చేసుకునే విషయంలో కూడా తారక్‌ ఒపీనియన్‌ తీసుకునేవాడ తేజ్‌. ఎలాంటి స్క్రిప్ట్‌ సెలెక్ట్‌ చేసుకోవాలి, సెలెక్షన్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తు తారక్‌ తేజ్‌కు ఓ అన్నలా ఉండేవాడట. తారక్‌తో పాటు కళ్యాణ్‌ రామ్‌ కూడా అదే స్థాయిలో తనకు సపోర్ట్‌ ఇచ్చేవాడని చెప్పాడు తేజ్‌. తాను యాక్సిడెంట్‌ నుంచి కోలుకున్నా తీసిన మొదటి సినిమా విరూపాక్షలో కూడా ఎన్టీఆర్‌ వాయిస్‌ తీసుకోవాడానికి కారణం ఇదే అని చెప్పాడు సాయి ధరమ్‌ తేజ్‌. తనకు ఎన్టీఆర్‌ రీ ఇంట్రడ్యూస్‌ చేస్తే బాగుటుందని చెప్పగానే ఏమీ ఆలోచించకుండా ఎన్టీఆర్‌ వాయిస్‌ ఇచ్చేశారట. ఈ విషయాన్ని విరూపక్ష మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో చెప్పాడు సాయి ధరమ్‌ తేజ్‌.