Sai Dharam Tej : బ్రేకప్ తరువాత అమ్మాయిలంటే భయమేస్తోంది.. సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్..!
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన బ్రేకప్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

Sai Dharam Tej
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన బ్రేకప్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. గతంలో తాను ఓ అమ్మాయిని ప్రేమించానని.. కానీ కొన్ని రోజుల తరువాత ఆ అమ్మాయితో బ్రేకప్ అయ్యిందని చెప్పాడు. అప్పటి నుంచీ ఏ అమ్మాయిని నమ్మాలన్నా తనకు భయం వేస్తోందన్నాడు. బ్రేకప్ తన జీవితంలో చాలా మార్పులు తీసుకువచ్చిందని చెప్పాడు తేజ్. ఎంతో చలాకీ ఉండే తాను బ్రేకప్ తరువాత చాలా సైలెంట్ అయ్యాడు. జనరల్‌గానే ఆంజనేయస్వామిని బాగా నమ్మే తేజ్.. బ్రేకప్ తరువాత నిష్టగా పూజలు చేయడం కూడా స్టార్ట్ చేశాడట.
బ్రేకప్ విషయాన్ని షేర్ చేసుకున్నాడు కానీ తాను లవ్ చేసిన అమ్మాయిక పేరు మాత్రం చెప్పలేదు తేజ్. కానీ ఆ అమ్మాయి విషయంలో గట్టి దెబ్బ తగిలిందని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. ఇక పెళ్లి విషయంలో లేట్ చేయడానికి కూడా ఇదే కారణమని చెప్పాడు సాయి ధరమ్ తేజ్. వయసు అయిపోతోందనో లేక ఇంట్లో వాళ్లు ఫోర్స్ చేస్తున్నారనో పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదట. కరెక్ట్ అమ్మాయి దొరికినప్పుడు, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానన్నాడు. సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.