Surender Reddy: పవన్ కరుణిస్తే సురేందర్ రెడ్డి ఫేట్ మారినట్టేనా?
మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహా రెడ్డి మూవీ తీసిన సురేందర్ రెడ్డి, ఇప్పడు మెగా తమ్ముడు పవర్ స్టార్‌తో సినిమా తీస్తే మెగా బ్రదర్స్‌తో సినిమాలు తీసిన క్రెడిట్ దక్కుతుంది. అంతేకాదు చరణ్‌తో ధృవ, బన్నీతో రేసుగుర్రం తీశాడు.

Surender Reddy: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సురేందర్ రెడ్డి సినిమా ఆల్‌మోస్ట్ ఓకే అంటున్నారు. ఆమధ్య ఆఫీస్ కూడా ఓపేన్ చేశారు. తర్వాత ఏమైందో కాని మధ్యలో తమిళ స్టార్ అజిత్‌తో కథ చర్చలు సాగాయి. హిందీ హీరో రణ్‌వీర్ సింగ్‌తోకూడా సూరి కథా చర్చలు జరిగాయి. కట్ చేస్తే పవన్ నుంచి పిలుపొచ్చిందని, కథ పైనల్ అయితే సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో పవన్ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఇదే సాధ్యమైతే సురేందర్ రెడ్డి.. మెగా డైరెక్టర్‌గా ఫోకస్ అయ్యే ఛాన్స్ ఉంది.
PUSHPA 3: ఈ సినిమాల సీక్వెల్స్ వస్తున్నాయా.. పబ్లిసిటీ స్టంటా..?
ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహా రెడ్డి మూవీ తీసిన సురేందర్ రెడ్డి, ఇప్పడు మెగా తమ్ముడు పవర్ స్టార్‌తో సినిమా తీస్తే మెగా బ్రదర్స్‌తో సినిమాలు తీసిన క్రెడిట్ దక్కుతుంది. అంతేకాదు చరణ్‌తో ధృవ, బన్నీతో రేసుగుర్రం తీశాడు కాబట్టే మెగా హీరోల్లో నాలుగు పిల్లర్స్‌తో మూవీలు తీసిన దర్శకుడిగా ఓ రికార్డు సొంతమయ్యే ఛాన్స్ ఉంది. త్రివిక్రమ్ ఎంత పవన్ ఆస్థాన గురూజీ అయినా, తను పవన్, బన్నీతోనే మూవీలు తీయగలిగాడు.
చిరు, చెర్రీతో సినిమాలు తీయలేదు. ఇక హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్, బన్నీ, సాయితేజ్‌తో మాత్రమే మూవీలు తీశాడు. చిరుతో ఇప్పడే సినిమా ఛాన్స్ వచ్చింది. కాని, ఏది మెటీరియలైజ్ కాలేదు. ఈ లెక్కన సురేందర్ రెడ్డి మెగా డైరెక్టర్‌గా మారడం ఖాయం.