నీ ఇంట్లో నువ్వు ఎగురు.. ఏమైనా చేసుకో.. రోడ్డు మీదకొచ్చి షో చెయ్యకు.. బన్నీ కి ఇచ్చి పడేసిన సురేష్ బాబు
సంధ్య థియేటర్ ఘటన వ్యవహారం సినిమా పరిశ్రమను చాన్నాళ్లపాటు వెంటాడుతుంది అనే మాట వాస్తవం. ఈ ఘటన విషయంలో అల్లు అర్జున్ ను చాలామంది తప్పుపట్టారు. అసలు పోలీసులకు సమాచారం లేకుండా వెళ్లాడు అనేది ప్రభుత్వ వాదన కూడా.
సంధ్య థియేటర్ ఘటన వ్యవహారం సినిమా పరిశ్రమను చాన్నాళ్లపాటు వెంటాడుతుంది అనే మాట వాస్తవం. ఈ ఘటన విషయంలో అల్లు అర్జున్ ను చాలామంది తప్పుపట్టారు. అసలు పోలీసులకు సమాచారం లేకుండా వెళ్లాడు అనేది ప్రభుత్వ వాదన కూడా. అయితే దీనిపై నిర్మాతలు కూడా ఆగ్రహంగానే ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒక న్యూస్ ఛానల్ తో మాట్లాడిన సురేష్ బాబు సంధ్యా థియేటర్ ఘటన మనకు చాలా విషయాలు నేర్పుతుందన్నారు.
అయితే అలాంటివి జరగాలని ఎవరూ కోరుకోరన్నారు సురేష్ బాబు. కానీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక పెద్దపెద్ద ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ మ్యాచ్ ల్లో కూడా తొక్కిసలాట ఘటనలు జరిగాయని… అయితే ఈ మధ్యకాలంలో సినిమా ఈవెంట్స్ ను చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారని… సోషల్ మీడియాలో బాగా ప్రమోషన్ చేస్తున్నారని… అలా పబ్లిసిటీ ఎక్కువ కావడంతో జనాలు విపరీతంగా వస్తున్నారని వాళ్లను కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉందంటూ కామెంట్స్ చేశారు.
ఈ విషయంలో ఈవెంట్ నిర్వాహకులు కూడా ఆలోచించుకుని అడుగులు వేయాలని… సెక్యూరిటీ విషయంలో కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని సురేష్ బాబు తను ఒపీనియన్ చెప్పారు. ఇక ఈ సందర్భంగా ఈవెంట్స్ కు వచ్చే ఫ్యామిలీలకు కూడా ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు. అక్కడ ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలనేది పిల్లలకు ముందే చెప్పాలన్నారు సురేష్ బాబు. పిల్లలతో రద్దీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని అక్కడ ఎలా ఉండాలి అనేది… ఎంత జాగ్రత్తలు తీసుకోవాలనేది పేరెంట్స్ కూడా ముందు ఆలోచించుకోవాలని హెచ్చరించారు.
మీ ఇంట్లో నువ్వు ఎగురు… డాన్స్ చెయ్… ఏమైనా బయటికి వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి కదా ఇవన్నీ ఇంట్లోనే చెప్పాలని సురేష్ బాబు కామెంట్ చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశం చాలా బాగా జరిగిందని డ్రగ్స్ విషయంలో సమాజం చాలా జాగ్రత్తగా ఉండాలని… లేదంటే సమాజాన్ని నాశనం చేస్తుందంటూ ఆయన కామెంట్ చేశారు. అందుకే డ్రగ్స్ నిర్మూలన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారని సినిమా పరిశ్రమ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉందంటూ కామెంట్స్ చేసుకొచ్చారు. సినిమా వాళ్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని లేకపోతే ఫ్యూచర్లో ప్రజల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని వార్నింగ్ ఇచ్చారు సురేష్ బాబు. తెలంగాణ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.