Suresh Kondeti: బిల్డప్‌ ఇచ్చింది సరే.. దీనికి ఆన్సర్‌ ఏది సురేశా..

ఏదైనా కొత్త సినిమా ప్రెస్‌ మీట్‌ ఉంది అంటే చాలు ఒక్కడ ఓ వ్యక్తి అడిగే ప్రశ్నకు మూవీ యూనిట్‌ మొత్తం ఇరిటేట్‌ అవుతుంటారు. అసలు సినిమాకు కథకు సంబంధం లేకుండా క్వశ్చన్‌ అడిగి వైరల్‌ అవుతుంటాడు ఆ వ్యక్తి. అతనే సీనియర్‌ ఫిలిం జర్నలిస్ట్‌ సురేశ్‌ కొండేటి. ఎవరు అడగని సంబంధం లేని క్వశ్చన్‌ అడిగి సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ అవడానికి ట్రై చేస్తున్నావంటూ రీసెంట్‌గా డైరెక్టర్ హరీష్‌ శంకర్‌ క్లాస్‌ పీకడంతో మరోసారి సురేష్‌ హాట్‌ టాపిక్‌గా మారాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 1, 2023 | 02:18 PMLast Updated on: Jun 01, 2023 | 2:18 PM

Suresh Kondeti Film Reporter Facing Trools

అంతే కాదు డైరెక్టర్‌ తేజ కూడా సురేష్‌ను సెపరేట్‌గా పిల్చుకుని మరీ ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్‌ అడుగుతావంటూ క్లాస్‌ తీసుకున్నాడు. ఈ వీడియో కూడా యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. సాధారణంగానే సురేష్‌ను ట్రోల్‌ చేస్తుంటారు కొందరు నెటిజన్లు. ఇక ఈ రెండు ఇన్సిడెంట్స్‌ తరువాత ట్రోలింగ్‌ డబుల్‌ అయ్యింది. పనికిమాలిన క్వశ్చన్స్‌ అడగటం దేనికి.. అనవసరంగా క్లాస్‌ పీకించుకోవడం దేనికంటూ సురేష్‌ను ఆడుకున్నారు నెటిజన్లు.

ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఫన్నీ థంబ్‌ నెయిల్స్‌తో ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు. దీంతో ట్రోలర్స్‌ను ఉద్దేశిస్తూ ఓ లెటర్‌ రిలీజ్‌ చేశాడు సురేష్‌. తన అనుభవమంత వయస్సు కూడా లేనివాళ్లు తనను ట్రోల్‌ చేస్తున్నారంటూ తెగ ఫీలయ్యాడు. తాను తలుచుకుంటే తన లీగల్‌ టీంతో యాక్షన్‌ తీసుకోగలనంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. స్క్రీన్‌ మీద కనిపించేది మాత్రమే అందరూ చూస్తున్నారు.. తెరవెనక జరిగే వ్యవహారం ఎవరికీ తెలియదని చెప్పాడు. ఆ తెరవెనక జరిగే వ్యవహారం ఏంటి అంటే.. డైరెక్టర్స్‌, ప్రొడ్యూసర్స్‌, యాక్టర్స్‌ సురేష్‌కు చాలా క్లోజ్‌ అట. ఆ చనువుతోనే ఇబ్బంది పెట్టేలా తాను క్వశ్చన్స్‌ అడుగుతాడట. వాళ్లు కూడా అంతే స్పోర్టివ్‌గా సమాధానాలు ఇస్తారట.

ఇలా జరిగితే నిజంగా బాగానే ఉంది. కానీ అసలు సీన్‌ ఏంటి అనేది స్క్రీన్‌ మీద ఆడియన్స్‌ చూస్తూనే ఉన్నారు. సురేష్‌ అడిగే క్వశ్చన్స్‌కు ఎంత మంది డైరెక్టర్స్‌ ఎన్నిసార్లు ఇరిటేట్‌ అయ్యారో ఎంత మంది హీరోలు సీరియస్‌ అయ్యారో మీడియా కంటే ఆడియన్సే ఎక్కువ గమనిస్తున్నారు. ఇవన్నీ ఆన్‌ స్క్రీన్‌ ఉన్నా కూడా.. తనను తాను కవర్‌ చేసుకునే ప్రయత్నం చేశాడు కొండేటి. ఇదంతా ఒకెత్తు అయితే.. ఇప్పుడు సురేష్‌ రిలీజ్‌ చేసిన లెటర్‌ను కూడా ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఒక సీనియర్‌ జర్నలిస్ట్‌ అయితే ఎంత బాధ్యత ఉండాలి.. మీరు అడిగే ప్రశ్నలు మీ సీనియారిటీని మట్టిలో కలిపేస్తున్నాయంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రెస్‌ మీట్లో అలాంటి ప్రశ్నలు అడగటం దేనికి.. ఇప్పుడు ఇలాంటి లెటర్లు రిలీజ్‌ చేయడం దేనికి అంటూ ఇంకో రౌండ్‌ వేసుకుంటున్నారు. ఈ ఇన్సిడెంట్‌ తరువాతైనా సురేష్‌ తన యాటిట్యూడ్‌ మార్చుకుంటాడో లేదో చూడాలి.