ఆ తెలుగు హీరో పెద్ద వేస్ట్ గాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్
శ్వేతా బసు ప్రసాద్... కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ జనాలకు పిచ్చెక్కించింది. ఆ సినిమాలో ఆమె మాటలకు యూత్ అప్పట్లో పిచ్చెక్కిపోయే వాళ్ళు.

శ్వేతా బసు ప్రసాద్… కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ జనాలకు పిచ్చెక్కించింది. ఆ సినిమాలో ఆమె మాటలకు యూత్ అప్పట్లో పిచ్చెక్కిపోయే వాళ్ళు. ఈ సినిమా హిట్ అవడంలో ఆమె కీ రోల్ ప్లే చేసింది. ఇంటర్ స్టూడెంట్ గా ఆమె చేసిన యాక్టింగ్ కు కూడా అప్పట్లో మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే ఆ తర్వాత శ్వేతా బసు ప్రసాద్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆమెకు సరైన ఆఫర్లు కూడా పెద్దగా రాలేదని చెప్పాలి. అయితే కొన్నాళ్లుగా ఆమె తెలుగు సినిమాకు చాలా దూరంగా ఉంటుంది.
లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. ఒక తెలుగు సినిమా సెట్ లో దారుణంగా అవమానించారని.. ఆమె గుర్తు చేసుకుంది. ఆ సెట్లో ప్రతి ఒక్కరూ తన బాడీ షేమింగ్ చేసారని దారుణంగా వెక్కిరించారని ఆమె కామెంట్స్ చేసింది. యాక్టర్ గా తాను చాలా కంఫర్ట్ గా ఉన్నానని… తనకు నచ్చిన సినిమాలు చేశానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీలో రాణిస్తున్నానని, కెరియర్ పరంగా ఇబ్బంది పడిన సందర్భాలు కొన్ని ఉన్నాయని గుర్తు చేసుకుంది.
ముఖ్యంగా ఒక తెలుగు సినిమా సెట్ లో చాలా ఇబ్బంది పడ్డాను అని… హీరోతో పోలిస్తే తాను ఎత్తు చాలా తక్కువగా ఉన్నానని.. సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఎగతాళి చేసేవారు అని, హీరో ఆరడుగులు ఉంటే ఈవిడేమో ఐదు అడుగులు ఉందని కామెంట్ చేసే వారని… హీరోతో వచ్చిన సమస్య మరో స్థాయిలో ఉండేదని చెప్పుకొచ్చింది. అతను ప్రతి సన్నివేశాన్ని మారుస్తూ ఉండేవాడని… గందరగోళానికి గురి చేసేవాడని రీ టేక్స్ ఎక్కువగా తీసుకునేవాడని చెప్పుకొచ్చింది. తెలుగులో డైలాగ్స్ చెప్పలేకపోయేవాడని… నిజం చెప్పాలంటే తనకు కూడా తెలుగు సరిగ్గా రాదని కామెంట్ చేసింది.
కానీ తాను ఏదో ఒకరకంగా డైలాగ్స్ నేర్చుకుని షూట్లో నడిపించే దానిని అని అతను మాత్రం అలా కాదని… మాతృభాష తెలుగు అయినప్పటికీ అతనికి భాష పై పట్టు లేదని… కానీ తనను మాత్రం తన కంట్రోల్ లో లేని తన ఎత్తు గురించి కామెంట్ చేసేవాడని ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఎత్తూ అనేది వారసత్వం గా వస్తుంది కదా..? దానికి తానెం చేస్తానని… తనకు తెలిసి తాను అంత బాధ పడిన సెట్ ఏదైనా ఉందంటే అదే అని శ్వేతాబసు గుర్తు చేసుకుంది. 11 ఏళ్ల వయసులోనే సినిమా కెరియర్ స్టార్ట్ చేసిన శ్వేతా బసు ప్రసాద్ 2008లో వచ్చిన కొత్త బంగారులోకం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత రైడ్, కాస్కో… సినిమాల్లో నటించింది. 2018 లో రిలీజ్ అయిన విజేత తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, సీరియల్స్ చేస్తూ బిజీ బిజీగా ఉంది.