1000 కోట్లు వచ్చినా.. సానుభూతి ఉన్నా… బన్నీది 3వ స్థానమే..?

పుష్ప 2 వెయ్యికోట్ల వసూళ్ల లెక్కలొచ్చాక ఇక ప్రభాస్ తర్వాత ప్లేస్ ఐకాన్ స్టార్ దే అన్నారు. ఒక వైపు వెయ్యికోట్ల వసూల్లు , ఇంకా రాబోతున్న కలెక్షన్లు... ఇలాంటి టైంలో బన్నీ అరెస్టు, తర్వాత రిలీజ్... ఫైనల్ గా వచ్చిన సానుభూతి.. ఇవన్నీ లెక్కేసుకుంటే బన్నీకి క్రేజు, సానుభూతి రెండు సమపాల్లలో దక్కాయంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 16, 2024 | 01:56 PMLast Updated on: Dec 16, 2024 | 1:56 PM

Sympothy Didnt Work Out For Pushpa 2

పుష్ప 2 వెయ్యికోట్ల వసూళ్ల లెక్కలొచ్చాక ఇక ప్రభాస్ తర్వాత ప్లేస్ ఐకాన్ స్టార్ దే అన్నారు. ఒక వైపు వెయ్యికోట్ల వసూల్లు , ఇంకా రాబోతున్న కలెక్షన్లు… ఇలాంటి టైంలో బన్నీ అరెస్టు, తర్వాత రిలీజ్… ఫైనల్ గా వచ్చిన సానుభూతి.. ఇవన్నీ లెక్కేసుకుంటే బన్నీకి క్రేజు, సానుభూతి రెండు సమపాల్లలో దక్కాయంటున్నారు. కాని రియాలిటీ మరో లా ఉంది. బన్నీ అరెస్ట్ నిజంగా తన యాంటీ ఫ్యాన్స్ ని కూడా అయ్యో పాపం అనేంతగా సీన్ మార్చింది… అలాంటి టైంలో పాన్ ఇండియా క్రేజ్, మార్కెట్ ఇమేజ్ పరంగా ఎవరి స్థానం ఏంటో తేలింది. ప్రభాస్, తర్వాత బన్నీ ఉంటాడనుకుంటే, మ్యాన్ ఆఫ్ మాసెస్ కే ఆ స్థానం దక్కింది. దేవర 510 కోట్ల తో పోలిస్తే, పుష్ప2 మూవీ 1000 కోట్లు లెక్క అందుకు డబుల్.. అయినా ఎన్టీఆర్ నే పాన్ ఇండియా నెంబర్2 అంటున్నారు. దానికి సాలిడి రీజనుంది… అదే షాకిస్తోంది.. అదేంటో చూసేయండి…

రెబల్ స్టార్ పాన్ ఇండియా కింగ్ గా పాన్ ఇండియా నెంబర్ వన్ గా గత 9 ఏళ్లుగా జెండా ఎగరేస్తున్నాడు. ఇది కొత్త విషయం కాదు… కల్కీ 1200 కోట్లతో కూడా ఈ ఏడాది మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. కాకపోతే ఇప్పుడు పాన్ ఇండియా నెంబర్ 2 ఎవరనేదే అసలు ప్రశ్న… బేసిగ్గా నైతే మొన్నటి వరకు త్రిబుళ్ ఆర్, దేవర ఇలా రెండు పాన్ ఇండియా హిట్స్ తో పాన్ ఇండియా నెంబర్ 2 కింగ్ నెంబర్ 2 హీరోగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆరే దూసుకెళ్లాడు

కాని ఇప్పుడు పుష్ప2 హిట్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా లెవల్లో రెండు హిట్లనే కాదు, 1000 కోట్ల వసూళ్లని కూడా సొంతం చేసుకున్నాడు. కాబట్టి, దేవరతో పోలిస్తే 490 కోట్లు అధికంగానే రాబట్టాడు. ఇంకా రాబడుతున్నాడు. అందుకే తనే పాన్ ఇండియా నెంబర్ 2 అంటూ ఓ చర్చ మొదలైంది

కాని ఇక్కడే కథ లో ట్విస్ట్ కనిపిస్తోంది. పాన్ ఇండియా నెంబర్ 1 రెబల్ స్టార్ అయితే, నెంబర్ 2 గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరే మరోసారి కన్పామ్ అయ్యింది.దేవర 510 కోట్ల తో పోలిస్తే పుష్ప2 తాలూకు 1000 కోట్లు ఆల్ మోస్ట్ డబుల్. అయినా ఒకవిషయంలో బన్నీ వెనకబడ్డాడు. తను అరెస్ట్ అవటం, రిలీజ్ అవటం ఈ మొత్తం సీన్ తో తన మీద జనాలకు సానుభూతి అయితే దక్కింది.

ఇండస్ట్రీ అంతా బన్నీకి తోడుగా నిలిచింది. మెగా స్టారే బన్నీ ఇంటికి వెళ్లేసరికి మెగా వ్యతిరేకతలో తీవ్రత కూడా చాలావరకు తగ్గింది.. సో ఒక అరెస్ట్ తో బన్నీకి మైనెస్ కంటే మంచే ఎక్కువ జరిగందంటున్నారు. అయినా పాన్ ఇండియా లెవల్లో మాత్రం 1000 కోట్లు రాబట్టి కూడా పాన్ ఇండియా నెంబర్ 2 స్థానం దక్కించుకోలేకపోయాడు ఐకాన్ స్టార్

దానికి కారణం ఎన్టీఆర్ మూవీ దేవర 510 కోట్లు రాబట్టొచ్చు కాని, దీనికి ముందు వచ్చిన త్రిబుల్ ఆర్ 1350 కోట్లు రాబట్టింది. మొత్తం లెక్కేస్తే 1860 కోట్ల వసూల్లతో తనే పాన్ ఇండియా లెవల్లో నెంబర్ 2 గా కొనసగాడుతున్నాడు. బన్నీ పుష్ప 450 కోట్లు రాబడితే, పుష్ప 2 మూవీ 1000 కోట్లు రాబట్టింది. మొత్తంగా 1450 కోట్ల లెక్కలతో మూడోస్థానంలో ఉన్నాడు బన్నీ…

షారుఖ్ అయితే పటాన్, జవాన్ తో 2 వేల కోట్ల పైనే వసూల్లు రాబట్టి పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ తర్వాత ప్లేస్ లో ఉండాలి. కాని తన సినిమాలు హిందీలో తప్ప మరెక్కడా సరిగ్గా ఆడలేదు.. ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో షేక్ చేశాయి.. కాబట్టే పాన్ ఇండియా లిస్ట్ లో వీళ్ల పేరుంది. ఖాన్లూ, కపూర్లకి ఇంకా ఆ సీన్ రాలేదనే సెటైర్ పేలింది.

ఇక త్రిబుల్ ఆర్ తప్ప మరో హిట్ పడని చరణ్ గేమ్ ఛేంజర్ రిజల్ట్ తో పాన్ ఇండియా నెంబర్ 4 ప్లేస్ దక్కించుకునే ఛాన్స్ఉంది. రాజమౌళి మూవీ చేసి, దాని రిజల్ట్ దుమ్ముదులిపాక సూపర్ స్టార్ మహేశ్ స్థానం ఏంటో తెలుస్తోంది. సో మొత్తంగా చూస్తే పాన్ ఇండియా నెం.1 ప్రభాస్ అయితే నెం2. మ్యాన్ ఆఫ్ మాసెస్, నెంబర్ 3 ప్లేస్ మాత్రం బన్నీకి దక్కింది.