Kalki : కల్కి’లో ‘టా టక్కరా’ ఒక్కటే పాట…

మే 9న రావాల్సిన కల్కి సినిమా.. ఫైనల్‌గా జూన్ 27న థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 18, 2024 | 10:29 AMLast Updated on: May 18, 2024 | 10:29 AM

Ta Takkara Is The Only Song In Kalki

 

 

మే 9న రావాల్సిన కల్కి సినిమా.. ఫైనల్‌గా జూన్ 27న థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. త్వరలోనే ప్రభాస్‌తో స్పెషల్ ఫ్యాన్స్‌ మీట్‌ కూడా ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. ఈ అయితే.. కల్కి సినిమా మొత్తానికి ఒక్కటే పాట ఉంటుందని తెలుస్తోంది. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో భాగంగా బిట్ సాంగ్స్ ఉంటాయట. ఇది తప్పితే సినిమాలో మరో పాట లేదని సమాచారం.

ఇక ఆ ఒక్క పాట కూడా ఇదేనని చెప్పాలి. గతంలో ‘టా టక్కరా’ అనే సాంగ్ బిట్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో ప్రభాస్ వామప్ చేస్తున్న చిన్న బిట్ రిలీజ్ చేశారు. ఇక లేటెస్ట్‌గా ఈ చిత్రానికి సంబందించిన మ్యూజిక్ రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్ లెబెల్ సరిగమ సొంతం చేసుకుందని ప్రకటించారు. దీంతో.. కల్కి నుంచి ‘టా టక్కరా’ ఫస్ట్ సింగిల్ ఈ నెలాఖరులో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సాంగ్ ప్రభాస్ ఫ్యాన్స్ చేత విజిల్స్, డ్యాన్స్ చేయించేలా ఉంటుంట.

ప్రభాస్, దిశా పటాని పై వచ్చే ఈ మాస్ బీట్ మామూలుగా ఉండదట. సంతోష్ నారాయణ్‌ అదిరిపోయే ట్యూన్ ఇచ్చినట్టుగా సమాచారం. త్వరలోనే కల్కి ఫస్ట్ సింగిల్ పై అధికారిక ప్రకటన రానుంది. ఇకపోతే.. దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కల్కి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.