Taapsee Pannu: సీక్రెట్ రివీల్.. వైరల్‌గా తాప్సీ పన్ను పెళ్లి వీడియో
తాప్సీ తన బోయ్ ఫ్రెండ్ మథియాస్ బోను సీక్రెట్‌గా పెళ్లాడింది. అయితే తన పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్నేళ్లుగా రిలేషన్‌లోఉన్న తాప్సీ, మథియాస్.. పెద్దలను ఒప్పించి ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి.

Taapsee Pannu: సినీ సెలబ్రిటీలు డేటింగ్‌లకు స్వస్తి చెప్పి వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. మూడేళ్లుగా ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్‌సింగ్ ఇటీవలే తన ప్రియుడితో కలిసి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ తాప్సీ వంతు వచ్చింది. తాప్సీ తన బోయ్ ఫ్రెండ్ మథియాస్ బోను సీక్రెట్‌గా పెళ్లాడింది. అయితే తన పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్నేళ్లుగా రిలేషన్‌లోఉన్న తాప్సీ, మథియాస్.. పెద్దలను ఒప్పించి ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి.
KTR: మాస్ వార్నింగ్.. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..!
అయితే బ్యూటీ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మాత్రం బయటకు రాలేదు. తాప్సీ కూడా పెళ్లికి సంబంధించి ఎలాంటి పోస్టులు పెట్టలేదు. కానీ తాజాగా తాప్సీ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో తాప్సీ ఎరుపు రంగు దుస్తులు ధరించి వరుడి దగ్గరకు వెళ్తూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత ఇద్దరు హగ్ చేసుకుని వేదికపైకి వెళతారు. చుట్టూ ఫొటో గ్రాఫర్లు ఫొటోలు, వీడియోలు తీస్తుండగా.. కొత్త జంట దండలు మార్చుకుంటారు. దీంతో అక్కడున్న వారంతా గులాబీ రేకులను కొత్త జంట మీద చల్లుతారు అంతటితో వీడియో అయిపోతుంది. తాప్పీ ప్రియుడు మథియాస్ డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇప్పుడు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 1998లో మథియాస్ తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. డబుల్స్‌లో ఆయన నెంబర్ 1 ర్యాంకును సాధించాడు. ప్రస్తుతం ఇండియా డబుల్స్ టీమ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 2012 ఒలింపిక్స్‌లో డబుల్స్‌లో సిల్వర్ మెడల్ గెలుపొందాడు.
2013 ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించాడు. 2013లో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సమయంలో తాప్సీ, మథియాస్ మధ్య రిలేషన్ ప్రారంభమయింది. 2010లో ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ తాప్సీ. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగి పలు సినిమాలు చేసింది. తమిళం, మలయాళంలోనూ మూవీస్ చేశారు. ఇక్కడ ఛాన్స్‌లు తగ్గడంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడే బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ నార్త్‌లోనే సెటిల్ అయ్యింది ఈ భామ. ప్రస్తుతం వరుస చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.
A Happy Bride is the prettiest of all! #TaapseePannu gets married to long time beau #MathiasBoe😍 @taapsee #BollywoodBubble pic.twitter.com/ULKZFTZp1T
— Bollywood Bubble (@bollybubble) April 3, 2024