Taapsee Pannu: ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన తాప్సీ.. పెళ్లెప్పుడంటే..!
దాదాపు పది సంవత్సరాల నుంచి వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారు. ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారు. సిక్కు, క్రిస్టియానిటీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తుంది. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో మార్చి నెలలో వీరి వివాహం జరగనున్నట్టు కొన్ని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

Taapsee Pannu: ఈ మధ్య హీరోయిన్లు వరుసగా పెళ్లి చేసుకుంటున్నారు. టాలీవుడ్‌లో వరుణ్ తేజ్, లావణ్య గత ఏడాది పెళ్లి చేసుకోగా.. తాజాగా బాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడిని పెళ్లాడింది. ఇప్పుడు ఇదే వరుసలో మరో హీరోయిన్ రెడీ అయిపోయింది. ఝుమ్మందినాదం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన తాప్సీ.. తరువాత బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. తాజాగా తన బోయ్ ఫ్రెండ్ మథియాస్ బోను పెళ్లాడబోతోంది అని తెలుస్తోంది.
దాదాపు పది సంవత్సరాల నుంచి వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారు. ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారు. సిక్కు, క్రిస్టియానిటీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తుంది. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో మార్చి నెలలో వీరి వివాహం జరగనున్నట్టు కొన్ని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. తాప్పీ ప్రియుడు మథియాస్ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ప్రస్తుతం ఇండియా డబుల్స్ టీమ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 2012 ఒలింపిక్స్‌లో డబుల్స్‌లో సిల్వర్ మెడల్ గెలుపొందాడు. 2013లో తాప్సీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో వీరిమధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ మధ్య షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన డంకీ చిత్రంలో నటించింది తాప్సీ. థియేటర్లలో అనుకున్నంతగా ఆడలేదు. కానీ ఓటీటీలో మాత్రం ప్రేక్షకులను అలరిస్తుంది.