తమిళ్ సినిమాను షేక్ చేస్తున్న స్పెషల్ సాంగ్స్ హవా ఇప్పుడు మన తెలుగులో కూడా స్టార్ట్ అవుతుంది. స్టార్ హీరోలు చిన్న హీరోలు తమ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు ప్రయారిటీ ఇస్తున్నారు. మాజీ హీరోయిన్లతో సాంగ్స్ చేసేందుకు డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఓకే చెప్పడంతో యంగ్ హీరోలు డాన్స్ చేయడానికి రెడీ అయిపోయారు. సినిమాకు ఆ సాంగ్స్ ద్వారా మంచి పబ్లిసిటీ రావడంతో హీరోలు కూడా వాటికి ఓకే చెప్పేస్తున్నారు. ఇప్పుడు మన తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కచ్చితంగా ప్రమోషన్ ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది అనే టాక్ వినబడుతోంది. ప్రస్తుతం నాగచైతన్య సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. చైతన్య తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో జాలరిగా నటిస్తున్న నాగచైతన్య ఈ సినిమాపై భార్య హోప్స్ పెట్టుకున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. సాయి పల్లవి హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనే ధీమాలో నాగచైతన్య ఉన్నాడు. ప్రస్తుతం పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్న నాగచైతన్య త్వరలోనే తిరిగి ఈ సినిమా షూట్ లో అటెండ్ కానున్నాడు. ఆ తర్వాత టాలీవుడ్ మాజీ హీరోయిన్ టబుతో స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీ అయ్యాడు. ఒక స్పెషల్ సెట్ లో ఈ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ ఇస్తున్న ఈ సాంగ్ కు దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటికే సాంగ్ కంపోజింగ్ కూడా కంప్లీట్ అయింది. త్వరలోనే సాంగ్ షూట్ కూడా మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. టబుతో అక్కినేని కుటుంబానికి మంచి అనుబంధమే ఉంది. గతంలో నాగార్జునతో ఆమెకు రిలేషన్ ఉంది అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారని ప్రచారం కూడా అప్పట్లో బాగా జరిగింది. ఇప్పుడు ఆమె నాగచైతన్యతో డాన్స్ ఫ్లోర్ షేర్ చేసుకోవడానికి రెడీ కావడంతో అభిమానులు కృషి అవుతున్నారు. ప్రస్తుతం టబు సినిమాల్లో తక్కువగా కనబడుతోంది. అప్పుడప్పుడు మంచి రోల్స్ వస్తే మాత్రమే సినిమాలు చేస్తోంది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోయే సినిమాలో ఆమెకు మంచి రోల్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. త్రివిక్రమ్ సినిమాల్లో మాజీ హీరోయిన్లకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటాడు గతంలో అలవైకుంఠపురములో సినిమాలో కూడా ఆమె నటించింది. ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్ సినిమాలో ఆమె కీ రోల్ ప్లే చేయనుంది. ఇక నాగచైతన్య సినిమా నుంచి త్వరలోనే ఒక సాంగ్ కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉంది.[embed]https://www.youtube.com/watch?v=rykgo0wVKOg[/embed]