Tamanna Bhatia: రూమర్స్ కావాలంటున్న తమన్నా.. కాని నో యూజ్..!
ఆ మధ్య తన పెళ్లి అంటూ వార్తలొస్తే నవ్విన తమన్నా.. ఇప్పుడు తను డేటింగ్ చేస్తున్నట్టు హింట్స్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోకపోవటంతో డీలా పడుతోంది. ఎంసీఏ ఫేం విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉన్నతనని బాలీవుడ్ మీడియానే కాదు.. సౌత్ మీడియా కూడా పట్టించుకోవట్లేదు.

Tamanna Bhatia: తమన్నా పాపం తన మీద రూమర్స్ పెరగాలని కోరుకుంటోందట. ఎవరైనా తన మీద గాలి వార్తలు వస్తే ఖండిస్తారు. ఫైర్ అవుతారు. కాని ఈ మిల్కీ బ్యూటీ కావాలని రూమర్స్‌కి డోర్స్ తీస్తోందని తెలుస్తోంది. అయినా పెద్దగా ప్రయోజనం ఉండట్లేదు. ఆ మధ్య తన పెళ్లి అంటూ వార్తలొస్తే నవ్విన తమన్నా.. ఇప్పుడు తను డేటింగ్ చేస్తున్నట్టు హింట్స్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోకపోవటంతో డీలా పడుతోంది.
ఎంసీఏ ఫేం విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉన్నతనని బాలీవుడ్ మీడియానే కాదు.. సౌత్ మీడియా కూడా పట్టించుకోవట్లేదు. ఒకసారి రెస్టారెంట్‌లో న్యూ ఇయర్ సందర్భంగా విజయ్ వర్మ, తమన్నా కిస్ చేసుకున్నారు. తర్వాత మరోసారి రెస్టారెంట్లో కనబడ్డారు. ఈమధ్యే కార్లో షికారుకెళ్లారు. అంతా మీడియా ముందే. కాని ఈ న్యూస్‌కి సోషల్ మీడియాలోనే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా పెద్దగా ఇంపార్టెన్స్ దక్కలేదు. థర్టీ ప్లస్ ఏజ్‌లో కెరీర్‌కి గుడ్ బై చెప్పే టైం వచ్చేసరికి, తమన్నాని ఎవరూ పట్టించుకోవట్లేదా? అంతగా అందాలు ఆరబోస్తున్నా పట్టించుకోవట్లేదనే.. ఈ డేటింగ్ రూమర్స్‌తో అయినా వార్తల్లో ఉండాలనుకుందా?
ఇలా రకరకాల డౌట్లు పెరుగుతున్నాయి. కాని అదేంటో ఏ హీరోయిన్ ఎప్పుడు ఎఫైర్ మ్యాటర్‌లో దొరుకుతుందా అనుకునే సినీజనాలు మాత్రం తమన్నా ఎఫైర్స్ మీద ఆసక్తి చూపట్లేదట. అందుకే తమన్నా పీఆర్ టీమే బయటికి ఫీలర్స్ వదులుతున్నారనే వదంతులు పెరిగాయి.