Tamannaah Bhatia : స్కూల్‌లో పాఠంగా తమన్నా జీవితం.. తిట్టిన తిట్టకుండా తిడుతున్న పేరెంట్స్..
మిల్కీ బ్యూటీ తమన్నాకు అన్ని ఇండస్ట్రీల్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తూ తన సత్తా చాటుతుంది.
మిల్కీ బ్యూటీ తమన్నాకు అన్ని ఇండస్ట్రీల్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తూ తన సత్తా చాటుతుంది. అంత స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ భామ.. వెబ్ సిరీస్‌ల్లో కూడా మెరిసింది. అందం, యాక్టింగ్, డాన్స్‌తో ప్రేక్షకుల చూపు పక్కకు తిప్పుకోనియకుండా చేసే ఈ నటి.. ఏకంగా 75 సినిమాల్లో యాక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. కళైమామణి, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది. దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు కోసం ఎనిమిది నామినేషన్లు, సాటర్న్ అవార్డుకు ఒక ప్రతిపాదనను అందుకుంది. తమన్నా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 19ఏళ్లు దాటుతున్నా… ఇంకా అదే గ్లామర్‌తో సినిమాల్లో హీరోయిన్‌గా, మెయిన్ లీడ్‌గా వరుస చిత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
ఇక మిల్క్ బ్యూటీ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇకపోతే తమన్నా ఓ విషయంలో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతుంది. కర్ణాటకలో బెంగళూరులోని హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల 7వ తరగతి పుస్తకాల్లో తమన్నా భాటియా అండ్ హీరో రణవీర్ సింగ్ గురించి చేర్చారు. వీరిద్దరి గురించి పాఠ్యాంశాలు చేర్చడంపై పెద్ద వివాదమే నెలకొంది. దేశవిభజన తర్వాత సింధీ ప్రముఖుల గురించి చేప్పే పాఠంలో వీరి పేర్లు చేర్చడం వివాదానికి దారి తీసింది. అయితే సింధీ వర్గంలో ఎంతో మంది కళాకారులు ఉండగా.. హీరోయిన్ తమన్నా జీవితం గురించి పాఠ్యాంశంగా చేర్చడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఇష్యూపై పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంగ్లీష్ స్కూళ్లు అసోసియేషన్ కర్ణాటక స్పందించి.. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరణ ఇస్తామని వెల్లడించింది. ఇక సినీ ఇండస్ట్రీలో ఎన్నో విజయాలు సాధించిన నటిగా పేరుగాంచడంతో పాఠ్యాపుస్తకాల్లో తమన్నా పేరు చేర్చడం జరిగిందని యాజమాన్యం చెప్తోంది.