Tamanna: కల్చర్‌ను నాశనం చేస్తున్నావ్.. మిల్కీ బ్యూటీ మీద భగ్గుమంటున్న ఫ్యాన్స్..
తమన్నా ముందు పుట్టి.. అందం తర్వాత పుట్టిందని ఫీల్ అవుతుంటారు ఆమె ఫ్యాన్స్. ఇండస్ట్రీకి వచ్చి కొన్ని ఏళ్లు అవుతున్నా.. గ్లామర్‌లో ఇంత కూడా మార్పు లేదు. అదే అందం.. అదే జోష్‌తో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

Tamannaah's role in the movie Lust Stories has angered the fans and they are commenting that it will destroy the tradition
ఐతే అమ్మడుకు అవకాశాలు నెమ్మదిగా తగ్గిపోతున్నాయ్. దీంతో బోల్డ్ కంటెంట్‌కు సై అన్నట్లు కనిపిస్తోంది. జీ కర్దా వెబ్‌సిరీస్‌తో ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన తమ్మూ.. నెట్‌ఫ్లిక్స్‌లో లస్ట్‌స్టోరీస్ 2తో మరింత హీట్ పుట్టించేందుకు సిద్ధం అవుతోంది. జీ కర్దా సిరీస్‌లో రొమాంటిక్ సీన్స్‌లో యాక్ట్ చేసి పొగలు రేపిన బ్యూటీ.. లస్ట్ స్టోరీస్‌లో అంతకుమించి అనిపించేలా ఉంది. ప్రియుడు విజయ్ వర్మతో కలిసి లస్ట్‌స్టోరీస్ 2లో యాక్ట్ చేస్తోంది తమన్నా. ఇప్పటికే ఈ ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈసారి మరింత బోల్డ్ సీన్స్‌లో నటించినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ప్రియుడు విజయ్ వర్మతో కలిసి.. వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది తమన్నా. ప్రమోషన్లలో భాగంగా ఒక ప్రోమోను రిలీజ్ చేసింది. ప్రోమో స్టార్టింగ్‌లోనే విజయ్‌తో బోల్ట్ సీన్‌ను చూపించారు. అందులో తమన్నా ముద్దుపెడుతున్న సీన్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇప్పటివరకు తమన్నా ఇలాంటి సీన్స్ చూడలేదని కొందరు అవాక్కవుతుంటే.. భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నావ్ అంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు.
నిన్ను ఇలా చూస్తున్నందుకు సిగ్గు పడుతున్నామని ఇంకొందకు ఘాటు కామెంట్లు పెడుతున్నారు. సీ గ్రేడ్ నటులతో ఇలాంటి సీన్స్ ఎలా చేస్తావ్ తమన్నా అని మరికొందరు ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. ఏమైనా లస్ట్ స్టోరీస్ 2కు బోలెడంతా ప్రమోషన్ వచ్చేసింది. ఐతే తమన్నాను అలా చూసి డైజెస్ట్ చేసుకోవడమే అభిమానులను కాస్త ఇబ్బంది పెడుతోంది.