తమన్నా దెబ్బకు తోక ముడుస్తున్న రికార్డులు.. కావాలమ్మా నువ్ ఆ సినిమాకు కావాలమ్మా..!
తమన్నా భాటియా.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. ఒకటి రెండు కాదు 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది తమన్నా.

తమన్నా భాటియా.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. ఒకటి రెండు కాదు 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది తమన్నా. ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినా కూడా తన స్టామినా మాత్రం చూపిస్తూనే ఉంది ఈ బ్యూటీ. ఇప్పటికీ తమన్న కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ రాస్తూనే ఉంటారు దర్శకులు. అయితే హీరోయిన్ గా కంటే కూడా స్పెషల్ సాంగ్స్ చేయడంలో ఈమె ఆరితేరిపోయింది. ఆమె సినిమాలో ఉంటే సూపర్ హిట్ అనే నమ్మకం దర్శకులలో పడిపోయింది. అందుకే తమన్నాతో ఒక్కసారైనా ఐటమ్ సాంగ్ చేయించాలని తెగ ఆరాటపడుతుంటారు దర్శకులు. సౌత్ సినిమాలలో ఇప్పటికే ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేసింది తమన్నా. ఇప్పుడు బాలీవుడ్ వైపు కన్నేసింది. అక్కడ కూడా ఆమె వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూనే ఉంది.
గతేడాది స్త్రీ 2 సినిమాలో ఆమె చేసిన ఆజ్ కి రాత్ సాంగ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా సంచలన విజయం సాధించడంలో ఆమె పాట కూడా కీలకపాత్ర పోషించింది అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు మరో సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసింది తమన్నా. అదే రైడ్ 2. అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వాణి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆరేళ్ల కింద వచ్చిన రైడ్ సినిమాకు సీక్వెల్ ఇది. మే 1న సినిమా విడుదల కానుంది. రాజ్ కుమార్ గుప్త తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఇందులో తమన్నా నషా ఎక్కించే స్పెషల్ సాంగ్ చేసింది. ఈ పాట విడుదలైన 24 గంటల్లోనే యూ ట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కోట్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. మామూలుగా అయితే బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ ఈ రేంజ్ లో మ్యాజిక్ చేయడం అరుదుగా చూస్తుంటాం. కానీ తమన్నా మాత్రం ఇలా అడుగుపెట్టిందో లేదో అలా రికార్డులతో చెడుగుడు ఆడుకుంటుంది.
కచ్చితంగా రైడ్ 2 సినిమాకు ఈ పాట బాగా హెల్ప్ అయ్యేలా కనిపిస్తుంది. కేవలం పాట వరకు మాత్రమే కాకుండా స్త్రీ 2 తరహాలోనే రెండు మూడు సన్నివేశాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. సౌత్ లో కూడా తమన్నా గోల్డెన్ లెగ్. ఆమె స్పెషల్ సాంగ్స్ చేసిన కేజిఎఫ్, జై లవకుశ, జైలర్ లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. అందుకే మిల్కీ బ్యూటీ ఐటమ్ సాంగ్స్ కు అంత డిమాండ్ ఉంటుంది. తాజాగా మరోసారి అదే మ్యాజిక్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక రైడ్ 2 విషయానికి వస్తే.. 2018లో విడుదలైన ఈ సినిమా మొదటి పార్ట్ సూపర్ హిట్ అయింది. అదే సినిమాను తెలుగులో మిస్టర్ బచ్చన్ పేరుతో రీమేక్ చేశారు కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ చేస్తున్నారు.. ఈ ట్రైలర్ చూస్తుంటే మిస్టర్ బచ్చన్ గుర్తుకొస్తుంది. మరి ఈసారి రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.