Mansoor Ali Khan: తమిళ నటుడిపై విష ప్రయోగం జరిగిందా.. ఇప్పుడెలా ఉన్నాడు..?
మన్సూర్ ఇటీవల ఒక రాజకీయ పార్టీ కోసం ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్ధతకి లోనయ్యాడు. ఇప్పుడు ఈ విషయంపై ఒక సంచలన ఆరోపణ చేసాడు. తనకి ఎవరో జ్యూస్‌లో విషం ఇచ్చారని చెప్పాడు.

Mansoor Ali Khan: మన్సూర్ అలీ ఖాన్.. తమిళ, తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైన నటుడు. తనకి మాత్రమే సాధ్యమైన నటనతో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి అశేష అభిమానులని సంపాదించుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ త్రిష మీద చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. తాజాగా ఆయన చేస్తున్న ఒక ఆరోపణ పెను దుమారం రేపుతుంది. మన్సూర్ ఇటీవల ఒక రాజకీయ పార్టీ కోసం ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడు.
MAHESH BABU-SS RAJAMOULI: బాక్సాఫీస్ వేట.. మహేష్ బాబు, రాజమౌళి టైం వచ్చేసింది
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్ధతకి లోనయ్యాడు. ఇప్పుడు ఈ విషయంపై ఒక సంచలన ఆరోపణ చేసాడు. తనకి ఎవరో జ్యూస్‌లో విషం ఇచ్చారని చెప్పాడు. గుడియాత్తం సంత నుంచి ఇంటికి వెళ్తుండగా కొంత మంది పండ్ల రసం ఇస్తే తాగానని, అది తాగిన కొద్ది సేపటికే గుండెల్లో నొప్పి వచ్చిందని చెప్పాడు. ప్రస్తుతం హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మరి ముందు ముందు ఈ విషయం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. మన్సూర్ 1990లో తమిళ చిత్ర రంగ ప్రవేశం చేసాడు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో కలిపి సుమారు 100 చిత్రాలకి పైనే నటించాడు. సింగర్‌గాను కొన్ని సినిమాల్లో పాటలు పాడి తన సత్తా చాటాడు. అలాగే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డుల్ని కూడా అందుకున్నాడు.
ఆయన అన్ని సినిమాలు చేసినా కూడా కెప్టెన్ ప్రభాకర్‌లో ఆయన పోషించిన క్యారక్టర్‌ని మాత్రం ప్రేక్షకులు మర్చిపోలేరు. ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడుగా మారాడు. ముఠామేస్తి, సాంబ, నరసింహ లాంటి చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. రీసెంట్‌గా విజయ్ లియోలో ఒక పవర్ ఫుల్ పాత్రలో మెరిశాడు. ఆయన స్వస్థలం తమిళనాడులోని దిండిగల్.