దేవర 172 కోట్లెక్కడ… 58 కోట్లతో పోలికెక్కడ… 1/3 కూడా కాదు..
దేవర మూవీ వచ్చి నెలలు గడుస్తున్నా, ఎన్టీఆర్ క్రియేట్ చేసిన రికార్డులు ఇంకా చాలా మంది హీరోలని భయపెడుతూనే ఉన్నాయి. 172 కోట్ల దేవర ఓపెనింగ్స్ తో ఇప్పుడు కంగువాని పోలుస్తున్నారు.
దేవర మూవీ వచ్చి నెలలు గడుస్తున్నా, ఎన్టీఆర్ క్రియేట్ చేసిన రికార్డులు ఇంకా చాలా మంది హీరోలని భయపెడుతూనే ఉన్నాయి. 172 కోట్ల దేవర ఓపెనింగ్స్ తో ఇప్పుడు కంగువాని పోలుస్తున్నారు. సూర్య హీరోగా వచ్చిన పాన్ ఇండియా మూవీ కంగువ థియేటర్ల సంఖ్య నుంచి, ఓవర్ సీస్ మార్కెట్ వరకు చాల విషయాల్లో దేవర స్ట్రాటజీనే ఫాలో అయ్యిందన్నారు. దేవరతో చాలా వరకు ఈ మూవీటీ పోల్చుకుందన్నారు. అది పెద్ద తప్పు కాదు. కాని దేవరని తమిళ నాడులో లైట్ తీసుకోవటం… కంటెంట్ బాగుందో లేదో చూసుకోకుండా, కేవలం పొరుగు హీరోలనే ఉద్దేశ్యమంతో తెలుగు హీరోలను సైడ్ చేయటం లాంటివి అక్కడి మార్కట్ లో కనిపించాయనే కామెంట్ ఉంది. కౌంటర్ గా తమిల్ మూవీలకు కూడా ఇక్కడ రెస్పాన్స్ షాక్ ఇస్తోందని కొన్ని సార్లు ప్రూవ్ అయ్యింది. కట్ చేస్తే కంగువ ఓపెనింగ్స్ వచ్చాయి… ఆలెక్కలు దేవర వసూళ్లతో పోలిస్తే, సగం కాదు, కనీసం వన్ బై థర్డ్ కూడా లేవు… ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ కి కారణమైంది…
కంగువ రిలీజ్ అయిన వెంటనే ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. కథ, కథనం, కొత్తగా లేకపోవటం వల్లే అంటూ కామెంట్స్ పెరిగాయి. కాని ట్యాలెంటెడ్ హీరో సూర్య పాన్ఇండియా మోజులో డైరెక్టర్ చేతిలో మోసపోడాడంటున్నారు. ఐతే కంగువా ఓపెనింగ్స్ మాత్రం 58 కోట్లు దాటాయి.. అంతే ఈ నెంబర్ రాగానే కోలీవుడ్ లో సూర్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటుంటే, ఇక్కడ మాత్రం కామెంట్ల ఎటాక్ షురూ అయ్యింది
కారణం, దేవర ఓపెనింగ్స్ తో పోలిస్తే కంగువాకి సగం కాదుకదా, కనీసం మూడింట్లో ఒక వంతు వసూల్లు కూడా రాలేదు… బేసిగ్గాసూర్య మీద తెలుగు జనాల్లో కాని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కాని ఎలాంటి వ్యతిరేకత లేదు. తమిళ హీరోల మీద కోపం అస్సలే లేదు. కాని అరవ ఆడియన్స్ తెలుగు సినిమాలను పట్టించుకోరు. బాహుబలి, త్రిబుల్ ఆర్, దేవర ఇలా ఏ పాన్ ఇండియా హిట్ మూవీని చూసినా, అన్నీ మార్కెట్లలో వసూళ్లు బాగుంటాయి..
కాని తమిళ నాటే తెలుగు మూవీ అంటే లైట్ తీసుకునే తత్వం కనిపిస్తుంది. పాన్ ఇండియా అడ్డు గోడల్ని కూల్చింది. ట్రెండ్ సెట్ చేసింది తెలుగు హీరోలు. తెలుగు దర్శక నిర్మాతలు.. అది ఓపెన్ గా అరవ హీరోలు ఒప్పుకున్నా, ఎందుకో తెలుగు పాన్ ఇండియా హిట్లకు అన్ని మార్కెట్లలో వచ్చినట్టు అరవ అడ్డాలో వసూళ్ల గోల ఉండదు…
దీనికి సమాధానమే కంగువ రిజల్టా? బేసిగ్గా కథ, కథనం మొత్తంగా కంటెంట్ బాగుంటే ఎవరైనా చూస్తారు.. చూడొద్దనో, చూడాలనో పనికట్టుకుని ఏమూవీని ఎవరూ ఎంకరేజ్ చేసే చాన్స్ ఉండదు. ఫ్యాన్స్ తప్ప ఏ సినిమానైనా మిగతా జనం థియేటర్స్ కెళ్లి చూడాలంటే మూవీలో మ్యాటర్ ఉండాలి..అదే లేదు కాబట్టే కంగువాకి కలెక్షన్లు పడిపోయాయి. ఓపెనింగ్స్ దేవర తో పోలిస్తే వన్ బై థాడ్ కూడా లేవు
దేవరి మొదటి రోజు 172 కోట్లు రాబడితే, కంగువాకి 58 కోట్లే వచ్చాయి. సగం కాదు, వన్ బై థార్డ్ లెవల్ కే పరిమితమైంది కంగువ… ఏదేమైనా దేవర విడుదలకు ముందు కూడా కామెంట్లు,ట్రోలింగ్స్ జరిగినా, కోలీవు్డ జనం దేవరని లైట్ తీసుకున్నా, ఈ మూవీ ఓపెనింగ్స్ రికార్డులు ఆగలేదు. వసూళ్ల వరదకి ఢోకాలేదు.. సో ఎవరు ఎంకరేజ్ చేసినా, చేయకున్నా మూవీలో మ్యాటర్ ఉంటే వసూళ్ల వరదకి బ్రేకులుండవు… అదే మరో సారి ప్రూవ్ అయ్యింది. కంగువ వసూళ్లతో దేవర స్టామినా ఏంటో పోలికలతో సహా అరవ జనాలకు అర్ధమౌతోంది.