ప్రభాస్ కోసం సూపర్ స్టార్ ను పరుగులు పెట్టిస్తున్న అరవ డైరెక్టర్

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో ఇండియా వైడ్ గా క్రేజ్ క్రియేట్ చేసిన.. తమిళ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్... ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 11, 2025 | 04:50 PMLast Updated on: Feb 11, 2025 | 5:11 PM

Tamil Director Lokesh Kanagaraj Directs Hero Prabhas Movie

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో ఇండియా వైడ్ గా క్రేజ్ క్రియేట్ చేసిన.. తమిళ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్… ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమాను ఆరు నెలలో కంప్లీట్ చేసే లోకేష్ ఇప్పుడు ఒక్కో సినిమాను టార్గెట్ ఫిక్స్ చేసుకొని కంప్లీట్ చేసేస్తున్నాడు. స్టార్ హీరోలతో ఎక్కువగా సినిమాలు చేసే ఇతను.. ఇప్పుడు సీక్వెల్స్ వైపు ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. త్వరలోనే ఖైదీ ఫ్రీక్వెల్ కూడా రానుంది. అయితే ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ తొందరపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమాను ప్లాన్ చేశాడు. ఈ పాన్ ఇండియా మూవీని కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. నాగార్జున తో సహా ఉపేంద్ర, శృతిహాసన్ సహా పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్ అంశంతో ముడిపడి ఉన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపొయింది. ఇక త్వరలోనే రజినీకాంత్ పోర్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. చెన్నై ఎయిర్ పోర్టులో రజనీకాంత్ పై కీలక సన్నివేశాలను డైరెక్టర్ షూట్ చేశాడు.

ఇక త్వరలోనే వైజాగ్ హైదరాబాదులో లాస్ట్ షెడ్యూల్ ఉంటుంది. మార్చినాటికీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ నెలలోనే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక వచ్చే వారంలోనే దీనిపై ఒక క్లారిటీ కూడా ఇచ్చే ఛాన్స్ కనబడుతోంది. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్ వినబడుతుంది. అయితే.. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ ఖైదీ ప్రీక్వెల్ ప్లాన్ చేయనున్నాడు. ఖైదీ ఫ్రీక్వెల్ కు ఇప్పటికే కథ రెడీ అయిపొయింది. దానికి కార్తీ కూడా రెడీ అయ్యాడు.

త్వరలోనే దీనికి సంబంధించి అప్డేట్ కూడా రానుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమా విషయంలో లోకేష్ పై ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. తన సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్ ను కూడా తీసుకోవాలని టార్గెట్ పెట్టుకున్న లోకేష్.. ఇప్పుడు ప్రభాస్ కోసం ఒక కథ కూడా రెడీ చేశాడు. రీసెంట్ గా దీనికి సంబంధించి ఓ వీడియో కూడా రిలీజ్ అవుతుంది అని, టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాలతో అది వాయిదా పడింది. కానీ ఇప్పుడు ఖైదీ ఫ్రీక్వెల్ పక్కన పెట్టేసి, ప్రభాస్ తో సినిమాను ముందుకు తీసుకెళ్లి.. ఫినిష్ చేసేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆరు నెలల్లో సినిమా కంప్లీట్ చేసేస్తాడు… కాబట్టి ప్రభాస్ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇక హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ ఈ సినిమాకు ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం.