Lokesh Kanakaraj: ప్రభాస్, చరణ్ సినిమా కన్ఫామ్.. కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన లోకేష్ కనకరాజ్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉలిక్కిపడేలా బాంబు పేల్చాడు తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్.ఈ ఇద్దరు గ్లోబల్ స్టార్స్ తో భారీ ప్రాజెక్టు అంటూ మెగా రెబల్ బాంబు విసురుతున్నాడు.

Lokesh Kanakaraj Movie Plan With Ram Charan And Prabhas
ఖైదీ, విక్రమ్ లాంటి మూవీలతో పాన్ ఇండియా లెవల్లో రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ తర్వాత అంతగా ఫోకస్ అయ్యాడు లోకేష్ కనకరాజ్. అలాంటి ఈ కోలీవుడ్ డైరెక్టర్ ప్రజెంట్ తమిళ స్టార్ విజయ్ దళపతితో లియో మూవీ తీస్తున్నాడు. తర్వాత రజినీకాంత్ మూవీ, ఆవెంటనే, రోలెక్స్ అంటూ సూర్య, ఖైదీ 2 అంటూ కార్తి మూవీ ప్లాన్ చేసుకున్నాడు.
అంత బానే ఉంది, కాని, ఇప్పట్లో తెలుగు హీరోలతో లోకేష్ మూవీ లేదనుకుంటున్న టైంలో, ఒకరు కాదు ఇద్దరు తెలుగు హీరోలతో తన సినిమా అని తేల్చాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఇంకా టచ్ లో ఉన్నానంటూ, ఈ హీరోతో తన సినిమా ఉందని తేల్చాడు. ఆల్రెడీ గతంలో రామ్ చరణ్ తో టచ్ లో ఉన్నానని ఆ ప్రాజెక్ట్ ని ఎప్పుడో తేల్చాడు. సో లియో తర్వాత సూపర్ స్టార్ రజనీసినిమా, ఆ తర్వాత రామ్ చరణ్ మూవీ, ఆవెంటనే ప్రభాస్ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఎలా చూసినా లియో అయిపోతోంది కాబట్టి, రజినీకాంత్ మూవీకి మరో ఏడాది పట్టినా, 2025 లో రామ్ చరణ్ మూవీ, 2026 లేదంటే 2027 లో ప్రభాస్ మూవీ పట్టాలెక్కొచ్చు.