Sri Leela: తనని వదిలేయమని.. తమిళ హీరోని వేడుకుంటున్న శ్రీలీల..
శ్రీలీలా టాలీవుడ్ లో ఏ పెద్ద హీరో మూవీ మొదలైనా, అక్కడ వినిపించే పేరు తనదే.. అంతగా పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్, మహేశ్ గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ రోల్ వేస్తోంది. ఇక నితిన్, వరుణ్ తేజ్ తో జోడీకడుతున్న తను బాలయ్య మూవీలో కూతురు రోల్ వేస్తోంది. అంతగా టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయ్యింది శ్రీ లీలా.

Tamil Hero Vijay Given Movie Offer to SriLeela
కట్ చేస్తే కోలీవుడ్ నుంచి శ్రీ లీలకు ఒకటే ఆఫర్లు. తమిళ దళపతి విజయ్ లియో తర్వాత చేయబోయే మూవీకి శ్రీలీలే హీరోయిన్ అన్నారు. కాని పవన్, మహేశ్, బాలయ్య మూవీలు చేస్తున్న శ్రీలీల ఏడాదిన్నర వరకు కనీసం ఒక్క వారం కూడా మరే మూవీకి డేట్లు ఇచ్చే పరిస్థితి లేదట. తమిళ్ ఆఫర్ కి టెమ్ట్ అయ్యి టాలీవుడ్ లో కలిసొస్తున్న ఆఫర్లను, కెరీర్ ని డిస్ట్రబ్ చేసుకోవద్దనుకుంటోందట.
విచిత్రం ఏంటంటే హీరోయిన్స్ విషయంలో ఎప్పుడూ జోక్యం చేసుకోని తమిళ దళపతి విజయ్ , ఫోన్ చేసీ మరీ శ్రీలీలతో మాట్లాడాడట. దీంతో అంత పెద్ద స్టార్ మాట కాదనలేక, చేతిలో ఉన్న ఉస్థాద్ భగత్ సింగ్ లాంటి ప్రాజెక్టులు వదులుకోలేక, కలిసొచ్చిన అదృష్టంతో కంగారు పడుతోంది శ్రీలీల. ఐనా విజయ్ కి కనీసం 10 నెలల టైం కోరిందట.. అది కూడా పవన్ కళ్యాణ్ డేట్లు, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తయ్యేందుకు పట్టే టైం తాలూకు అంచనాలు తెలుసుకుని ఇలా కోలీవుడ్ ఆఫర్స్ కి క్లారిటీ ఇచ్చిందట.