Vijay: కోలీవుడ్ పవర్ స్టార్ కి ఇదే ఆఖరి చిత్రం.. పవన్ దారిలోనే విజయ్..
టాలీవుడ్ కి పవన్ కల్యాణ్ ఎలా పవర్ స్టారో, కోలీవుడ్ కి విజయ్ దళపతి కూడా అలానే పవర్ స్టార్ లాంటి ఇమేజ్ ఉన్న హీరో. విచిత్రం ఏంటంటే తను పవన్ కళ్యాణ్ కి బేసిగ్గా ఫ్యాన్.. ఇద్దరూ ఒకరి హిట్ మూవీలు మరొకరు రీమేక్స్ చేస్తూ అలా స్నేహాన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఒకరి దారిలో మరొకరు నడిచే లా ఉన్నారు.

Tamil power star Vijay wants to say goodbye to films and enter politics
మాస్టర్, తేరీ, తుఫాకి లాంటి హిట్స్ తో ఇక్కడి జనాలకు కూడా దగ్గరైన తమిళ దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు. ఎన్నో సార్లు ఇలాంటి పుకార్లు వస్తే అదేం లేదన్న విజయ్, ఈ సారి మాత్రం పొలిటికల్ ఎంట్రికి రంగం సిద్దం చేసుకున్నాడు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ స్ట్రాటజీనే ఫాలో కాబోతున్నాడట.
పవన్ ఓవైపు సినిమాలు చేస్తూనే, ప్రజా సేవకి రంగంలోకి దిగాడు. అచ్చంగా అలానే విజయ్ కూడా సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడట. కాని లియో తర్వాత వెంకట్ ప్రభు మేకింగ్ లో విజయ్ చేసే సినిమానే ఆఖరి మూవీ అంటున్నారు. ఇప్పటికే లోకేష్ మేకింగ్ లో రజినీకాంత్ ఆఖరి సినిమా చేయబోతున్నాడన్నారు. ఆతర్వాత తను సినిమాలనుంచి రిటైర్ అవుతాడన్నారు. ఇంతలో విజయ్ కూడా వెంకట్ ప్రభు మూవీ తర్వాత సినిమాలు పక్కన పెట్టి రాజకీయాలతోనే బిజీ అవుతాడంటున్నారు. పవన్ కూడా ఈ ఏడాది తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి పూర్తిగా రాజకీయాలకే అంకితం అవ్వొచ్చు లేదంటే,రెండు మూడేళ్ల తర్వాత సినిమాలు, రాజకీయాలు ప్యార్ లల్ గా కంటిన్యూచేయొచ్చనే అభిప్రాయముంది. ఇలానే పవన్ రూట్లోనే వెళ్లాలని విజయ్ అనుకుంటున్నాడట. ఆల్రెడి పవన్ కి టచ్ లో ఉన్న విజయ్, విచిత్రంగా పవర్ స్టార్ తో కూడా ఫోన్ లో మాట్లాడినట్టు కోలీవుడ్ లో ప్రచారం పెరిగింది. అలా పవన్ పేరు చెన్నైలో మారుమోగుతోంది.