తెలుగుపై అరవోళ్ళ కుళ్ళు పుష్ప 2తో బయటపడిందా…? బ్యాక్ గ్రౌండ్ లో కుట్ర
పాన్ ఇండియా లెవెల్లో విడుదల అన్ని సినిమాల్లోనూ టాలీవుడ్ డామినేషన్ క్లియర్ గా కనబడుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ప్రతి సినిమా కూడా దాదాపుగా రికార్డులను బ్రేక్ చేస్తుంది. స్టార్ హీరోలు సినిమాలు వస్తుంటే బాలీవుడ్ హీరోలు కూడా భయపడే పరిస్థితి నేషనల్ లెవెల్ లో ఉంది.
పాన్ ఇండియా లెవెల్లో విడుదల అన్ని సినిమాల్లోనూ టాలీవుడ్ డామినేషన్ క్లియర్ గా కనబడుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ప్రతి సినిమా కూడా దాదాపుగా రికార్డులను బ్రేక్ చేస్తుంది. స్టార్ హీరోలు సినిమాలు వస్తుంటే బాలీవుడ్ హీరోలు కూడా భయపడే పరిస్థితి నేషనల్ లెవెల్ లో ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఓవర్సీస్ లో కూడా ఇండియన్ సినిమాలదే డామినేషన్ ఎక్కువగా కనబడుతోంది. అయితే ఇప్పుడు ఇది చూసి ఓర్వలేక పోతున్నారు తమిళ హీరోలు. అక్కడి డైరెక్టర్లకు కూడా కంటి మీద కునుకు లేకుండా పోయింది.
మన స్టార్ హీరోలకు నేషనల్ లెవెల్ లో వస్తున్న ఇమేజ్ చూసి వారిని డి గ్రేడ్ చేసే ప్రయత్నం గట్టిగానే జరుగుతోంది. పుష్ప సినిమాకి సంబంధించి బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఈవెంట్ పై తమిళ హీరో సిద్ధార్థ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. బీరు, బిర్యానీ కోసం అంతమంది వచ్చారని ఒక జెసిబి వచ్చిన చూడటానికి జనాలు వస్తారంటూ సిద్ధార్థ కామెంట్ చేశాడు. ఇక మన తెలుగు హీరోల సినిమాల విషయంలో తమిళ నిర్మాతలు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కఠినంగా వ్యవహరించాలని అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
త్వరలో భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ ఉంది. ముఖ్యంగా రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాలకు తమిళంలో కూడా మంచి క్రేజ్ వస్తుంది. ఇది చూసి ఓర్వలేని అక్కడి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లను ఎక్కువగా ఇవ్వద్దు అని నిర్ణయానికి వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అటు కన్నడ సినిమాలో కూడా మన తెలుగు హీరోల సినిమాలో రిలీజ్ అవుతుంటే భయపడుతున్నారు. అందుకే ఎక్కువ థియేటర్లను ఇవ్వద్దని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.
పుష్ప సినిమాను తమిళంలో ఫ్లాప్ చేయడానికి అక్కడ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు కాస్త ఎక్కువగానే కష్టపడ్డారు. థియేటర్లను ఇచ్చినా షోస్ ఎక్కువగా రన్ చేయలేదు అని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక మన తెలుగులో చిన్న సినిమాలకు ఏమాత్రం కూడా థియేటర్లు ఇవ్వడానికి అక్కడ నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదు. కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన సినిమాకు అక్కడ ఒక్క థియేటర్ కూడా కేటాయించలేదు. దీనిపై ఇప్పుడు మన తెలుగు దర్శక నిర్మాతలు సీరియస్ గానే ఉన్నారు. భవిష్యత్తులో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సరే తెలుగులో కూడా తమిళ హీరోలకు థియేటర్లో ఇవ్వద్దు అనే ఆలోచనలోనే మన నిర్మాతలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తోంది.