ఎన్టీఆర్ ని మక్కీకి మక్కి… కాపీకొడుతున్నాడా..?
వార్ 2 మూవీ ఇంకా పూర్తి కాలేదు. రిలీజ్ కి కూడా చాలానే టైం ఉంది. కాని ఈలోపే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ కాంబినేషన్ తో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయ్. ఈ సినిమా షూటింగ్ తాలూకు క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
వార్ 2 మూవీ ఇంకా పూర్తి కాలేదు. రిలీజ్ కి కూడా చాలానే టైం ఉంది. కాని ఈలోపే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ కాంబినేషన్ తో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయ్. ఈ సినిమా షూటింగ్ తాలూకు క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ సాయంతో ఫ్యాన్స్ చేసే టీజర్ లు కూడా వైరలౌతున్నాయి… అంత క్రేజ్ కి కారణం ఏంటో ఆలోచించాడో, లేదంటే అరవ హీరోలని ఇలానే పాన్ ఇండియా లెవల్లో ఫోకస్ చేయాలనుకున్నాడో కాని, మొత్తానికి డైరెక్టర్ ఆట్లీ అరవ దళపతి విజయ్ ని లైన్ లోకి తీసుకొస్తున్నాడు. రాజీకీయాల్లో అడుగుపెట్టిన విజయ్ ఇప్పడు, సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టే టైంలో బాలీవుడ్ లో అడుగుపెడతానంటున్నాడు.. అందుకు అచ్చుగుద్దినట్టు ఎన్టీఆర్ దారిలోనే నడవాలనుకుంటున్నాడు… ఇంతకి ఏరకంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ని విజయ్ కాపీకొట్టబోతున్నాడు..? అదెలా తనకి కలిసొస్తుందనుకుంటున్నాడు?
త్రిబుల్ ఆర్ తో వచ్చిన ఇమేజ్ ని వెంటనే దేవరతో మార్కెట్ గా మార్చుకోగలిగాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. తర్వాత వెంటనే పాన్ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా లాంచ్ చేశాడు. కట్ చేస్తే, దేవర సీక్వెల్ ని ఆ తర్వాత బ్యాకప్ గా పెట్టుకున్నాడు.. కాని మధ్యలో తను బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న వార్ 2 మూవీ ప్లానింగ్ మాత్రం తెలివైన పని అన్నారు
వార్ 2 లో ఎన్టీఆర్ నటిస్తున్నాడంటూ మొదట్లో వార్త రాగానే, తారక్ రాంగ్ డిసీజన్ తీసుకున్నాడన్నారు. హ్రితిక్ రోషన్ ముందు తారక్ తేలిపోతాడన్నారు. కామెంట్లు పెంచారు. కట్ చేస్తే దేవర హిట్ తర్వాత, నార్త్ ఇండియాలో తనకి ఊర మాస్ ఫాలోయింగ్ ఉందని తెలిశాక, హ్రితిక్ ఫ్యాన్సే టెన్షన్ పడాల్సి వస్తోంది
ఎందుకంటే తారక్ న్యాచురల్ పెర్ఫార్మర్…. హ్రితిక్ ఎంత గొప్ప డాన్సరైనా, గ్రీక్ గాడ్ లుక్స్ ఉన్నా, పెర్పామెన్స్ లో తారక్ రూటే సెపరేటు… మాస్ మతిపోగొట్టే డాన్స్ కి కూడా తను కేరాఫ్ అడ్రస్… అన్నీంటికి మించి నార్త్ హీరో అయిన హ్రితిక్ కంటే ఉత్తరాది మాస్ లో ఎన్టీఆర్ కే సాలిడ్ ఫాలోయింగ్ ఉందని దేవరతో తేలింది..
ఇవన్నీ ముందే ఆలోచించాడో, లేదంటే నార్త్ ఇండియాలో మార్కెట్ మీద పట్టు పెంచుకునేందుకు వార్ 2 లోనటించాలన్న నిర్ణయమే కరెక్ట్ అనుకున్నాడో… మొత్తానికి వార్ 2 తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు తారక్.. ఐతే ఇప్పుడు ఎన్టీఆర్ స్ట్రాటీజీ తమిల తంబీ విజయ్ కి నచ్చినట్టుంది. అందుకే మక్కీకి మక్కీ కాపీకొడుతున్నాడు
పాన్ ఇండియా లెవల్లో బీస్ట్, లియో, వారసుడు, గోట్ మూవీలో చేసినా అన్నీ అరవ అడ్డాలో తప్ప, నార్త్ ఇండియాలో పెద్దగా వర్కవుట్ కాలేదు. వాళ్లెవరు ఈ హీరోకి పెద్దగా రిసీవ్ చేసుకున్నట్టు లేదు. అందుకే హిందీ హీరోతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడట విజయ్. షారుఖ్ తోజవాన్ తీసి 1000 కోట్ల హిట్ సొంతం చేసుకున్న ఆట్లీ, ఇప్పుడు షారుఖ్, సల్మాన్, విజయ్ దళపతితో సాలిడ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. నలుగురు హీరోలుంటే,ఈ మూవీలో నాలుగో హీరో మాత్రం ఇంకా కన్ఫామ్ కాలేదు
వార్ 2 లో ఎన్టీఆర్ హీరో కాకున్నా, నార్త్ మార్కెట్ మీద పట్టకోసం తారక్ విలనీ వేషం వేసేందుకు సిద్దపడ్డాడు…. అందుకే విజయ్ కూడా ఇది నచ్చే తన రూట్ మార్చాడు. నార్త్ ఆడియన్స కి దగ్గరయ్యేందుకు ఇలాంటి స్ట్రాటజీనే బెటర్ అని ఫిక్స్ అయినట్టున్నాడు. హిందీ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్దపడ్డాడు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు కాబ్టటి, ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెడతాడనే ప్రచారం జరుగుతుంటే, సడన్ గా రూట్ మార్చాడు. ఎన్టీఆర్ దారిలోనే హిందీ మల్టీ స్టారర్ మూవీకి సిద్దపడ్డాడు.