Tandel : మార్వలెస్ న్యూస్.. యోధుడిగా చైతూ.. గ్లింప్స్ రిలీజ్ ఎప్పుడో తెలుసా..?
టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో, కార్తికేయ 2 ఫేమ్ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ తండేల్.. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి మరో అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. చైతూ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న గ్లింప్స్ వీడియో కి సంబందించి మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఎసెన్స్ ఆఫ్ తండేల్ ను జనవరి 5న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Tandel is an action entertainer directed by Karthikeya 2 fame director Chandoo Mondeti starring Tollywood young hero, Akkineni Naga Chaitanya in the lead role.
టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో, కార్తికేయ 2 ఫేమ్ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ తండేల్.. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి మరో అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. చైతూ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న గ్లింప్స్ వీడియో కి సంబందించి మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఎసెన్స్ ఆఫ్ తండేల్ ను జనవరి 5న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యంత ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్ట్ ఇది.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండంతో ఈ సినిమా సాంగ్స్‌పై ఇప్పటికే హైప్ ఏర్పడింది.
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై చందూ మొండేటి లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నాడు. తండేల్ టైటిల్ వెనుక ఉన్న అర్దాన్ని వివరించాడు. తండేల్ అంటే గుజరాతీలో ‘బోట్ ఆపరేటర్’ అని చెప్పేశాడు. ఈ తండేల్ అనే పదాన్ని.. గతంలో గుజరాత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని కుగ్రామాల్లో ఎక్కువగా ఈ పదాన్ని పలికేవారని చందు తెలిపాడు. తండేల్ అంటే.. నాయకుడు, కెప్టెన్ అట. ఎలాంటి భయం, బెరుకు లేనివాడు అని అలాంటి యోధుడినే తండేల్ అంటరాని.. అలా.. ఓ యోధుడి పాత్రలో చైతు కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
ఇక.. ఈ సినిమా కోసం తండేల్గా కనిపించేందుకు.. చై గత ఆరు నెలలుగా చాలా కష్టపడుతున్నాడని చందూ వెల్లడించాడు. రీసెంట్గా శ్రీకాకుళంలోని మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించిన చై.. అక్కడ స్థానిక మత్స్యకారులతో ముచ్చటించి, వారి బాడీ లాంగ్వేజ్‌ని పరిశీలించారు. అలా శ్రీకాకుళం మాండలికం.. వారి యాస.. భాష పై.. పట్టు సాధించడంతో పాటు మత్స్యకారుల బాడీ లాంగ్వేజ్‌పై స్టడీ చేశాడు. ఇప్పటికే తన జుట్టు గడ్డం పెంచడమే కాకుండా, చై.. తన శరీరాన్ని పెంచుకోవడానికి జిమ్‌కు కూడా వెళుతున్నాడు. ఇందులో కొత్త చెతన్య నే కాదు.. సరికొత్త నాగ చైతన్య ను చూస్తారంటూ టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.